KTR vs Bandi Sanjay :  బండి సంజయ్‌కి 48 గంటల డెడ్‌లైన్‌.. సారీ చెప్పకపోతే అంతే...కేటీఆర్ వార్నింగ్

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్‌ సిట్‌ ముందు విచారణకు హజరయ్యారు. అనంతరం పలు ఆరోపణలు చేశారు. దీనిపై బీఆర్ఎస్ నేత కేటీఆర్‌ స్పందించారు. ఆరోపణలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకపోతే లీగల్‌ నోటీసులు పంపిస్తానని హెచ్చరించారు.

New Update
KTR vs Bandi Sanjay

KTR vs Bandi Sanjay

KTR vs Bandi Sanjay:  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ రోజు కేంద్రమంత్రి బండి సంజయ్‌ సిట్‌ ముందు విచారణకు హజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ఆరోపణలు చేశారు.దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ చేసిన ఆరోపణలను కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. మీ ఆరోపణల్లో కొంతైనా నిజం ఉందో లేదో నిరూపించాలని కేటీఆర్‌ సవాలు విసిరారు. బండి సంజయ్ రాబోయే 48 గంటల్లో నా పై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. ఒక వేళ క్షమాపణ చెప్పకపోతే లీగల్‌ నోటీసులు పంపిస్తానని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి:సీఎం రేవంత్ సొంత జిల్లాలో బీజేపీ మాస్టర్ ప్లాన్.. ఆ ఐదుగురు నేతలు జంప్?

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పటికీ బండి సంజయ్‌కు తెలివితేటలు ఎలా పనిచేస్తున్నాయో అర్థం కావడం లేదంటూ కేటీఆర్ ఫైర్‌ అయ్యారు. కేంద్ర మంత్రికి కనీస సాధారణ జ్ఞానం కూడా లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రిగా ఉన్నప్పటికీ బండి సంజయ్‌కు ఇంటెలిజెన్స్ ఎలా పని చేస్తుందో తెలియదు అంటూ విమర్శించారు.అతడి నిర్లక్ష్యపు ప్రకటనలు హద్దులు దాటాయి. కేవలం  రాజకీయ ఉనికి కోసం ఇంకెన్నాళ్లు ఇలా రోడ్లపై చౌకబారు విమర్శలు చేస్తారని కేటీఆర్‌ సీరియస్ అయ్యారు. ఇంటెలిజెన్స్ విభాగంపై బండి సంజయ్‌కు కనీస పరిజ్ఞానం లేదని విమర్శించారు. ఇలాంటి వ్యక్తి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఎలా కొనసాగుతున్నారో అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇంత చౌకబారు ఆరోపణలు చేయడం, థర్డ్ క్లాస్ ప్రకటనలు చేయడం అతడికి కొత్త కాదని విమర్శించారు. 

Also Read : తెలంగాణ ఆర్టీసీ బంఫర్‌ ఆఫర్‌.. బస్సు ఎక్కితే చాలు..

బండి సంజయ్‌ మంత్రిగా పనిచేయడం అంటే ఢిల్లీ బాసుల చెప్పులు మూసినంత ఈజీ కాదని.. బండి సంజయ్‌కి ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిదని కేటీఆర్‌ హితవు పలికారు. కేవలం తనకు రాజకీయ ప్రాధాన్యత దక్కకపోవడం వల్లే,  కేవలం వార్తల్లో నిలవాలని తనకు అలవాటైన చౌకబారు వీధి నాటకాలకు తెరలేపారని కేటీఆర్‌ విమర్శించారు. ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తుందో.. ఎలా పని చేస్తుందో కూడా బండి సంజయ్‌కి అవగాహన లేదని తీవ్ర విమర్శలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో బండి సంజయ్ చేసిన ఆరోపణలు అన్నీ నిరూపించాలని డిమాండ్ చేశారు. లేకపోతే.. చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని అన్నారు.

ఇది కూడా చదవండి:తెలంగాణ రైతులకు శుభవార్త.. కొత్త పాస్‌బుక్ వచ్చిన వారందరికీ ఈ నెలలో రైతు బీమా

Advertisment
తాజా కథనాలు