Road Accident : పల్నాడు జిల్లాలో బోల్తా పడ్డ ట్రాక్టర్, నలుగురు మృతి
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ముప్పాళ్ల మండలం బొల్లవరం వద్ద ట్రాక్టర్ బోల్తాపడి నలుగురు కూలీలు మృతిచెందారు. చాగంటివారిపాలెంకు చెందిన 25 మంది మహిళా మిర్చి కూలీలు వ్యవసాయ పనుల నిమిత్తం బొల్లవరం గ్రామానికి ఆదివారం ఉదయం వెళ్లారు.