/rtv/media/media_files/2025/08/27/gold-2025-08-27-09-13-01.jpg)
gold
ఈ మధ్యకాలంలో దోపీడీలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏ చిన్న అవకాశం దొరికినా కూడా దొంగతనం చేయడానికి కొందరు దుండగులు రెడీ అవుతున్నారు. మనుషులను మోసం చేసి దోచేయడమే పనిగా పెట్టుకుంటున్నారు. ఇంట్లో ఉన్నా బయటకు వెళ్లినా ఇలా ప్రతీ దగ్గర ఇలాంటి దారుణాలే జరుగుతున్నాయి. అయితే తాజాగా ప్రయాణికులు ప్రయాణిస్తున్న రైళ్లలో తాజాగా దుండగులు దొంగతనం చేశారు. ప్రయాణికులు నిద్ర మత్తులో ఉండగా లోకోపైలెట్లకు సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి మరి దుండగులు బంగారం కొట్టేశారు. వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి రైల్వే స్టేషన్ సమీపంలో నర్సపూర్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ జరిగింది.
ఇది కూడా చూడండి: Vaishno Devi Yatra: విషాదం.. 31కి చేరిన మృతుల సంఖ్య (VIDEOS)
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి రైల్వే స్టేషన్ సమీపంలో నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ చోరీ జరిగింది. సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి ఎక్స్‌ప్రెస్ రైల్లోకి చొరబడిన దొంగల ముఠా మహిళల మెడలోని 68 గ్రాముల బంగారాన్ని దొంగలించారు.https://t.co/UkuCEb8dX0#AndhraPradesh…
— RTV (@RTVnewsnetwork) August 27, 2025
సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి రైల్లోకి..
సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి ఎక్స్‌ప్రెస్ రైల్లోకి దొంగల ముఠా చొరబడ్డారు. మాచర్ల హైవే అండర్ బ్రిడ్జి సమీపంలో దుండగులు పట్టాల పక్కన హోమ్ సిగ్నల్స్ దుండగులు ట్యాంపర్ చేశారు. దీంతో రెడ్ సిగ్నల్ పడిందని లోకో పైలెట్లు రైలును దాదాపు 35 నిమిషాల పాటు ఆపేశారు. ఈ సమయంలో దొంగల ముఠా మహిళల మెడలోని బంగారు ఆభరణాలను చోరీ చేశారు. ముఠా సభ్యులు రైల్లోకి చొరబడి ఎస్-1, ఎస్-2, ఎస్-3 బోగీల్లోని ఇద్దరు మహిళల మెడలో 68 గ్రాముల బంగారు గొలుసులు దొంగలించారు. అలాగే ఓ మహిళ మెడలోని రోల్డ్ గోల్డ్ గొలుసు కూడా కొట్టేశారు. ఎస్-5 బోగిలోనూ చోరీకి ప్రయత్నించారు. ఇంతలో ప్రయాణికులు కేకలు వేయడంతో వెంటనే పరారయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై రమేష్ తెలిపారు.
పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల, నడికుడి జంక్షన్లలో రైళ్లలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ రోజు తెల్లవారుజామున నడికుడి రైల్వే బ్రిడ్జి వద్ద నర్సాపూర్ ఎక్స్ప్రెస్ను ఆపి, ప్రయాణికుల నుంచి బంగారం దోచుకుని దొంగలు పారిపోయారు. ఇది ఇక్కడ మూడోసారి జరిగిన ఘటన. కొద్ది నెలలుగా ఇలాంటి… pic.twitter.com/wuI3HV5GC1
— RTV (@RTVnewsnetwork) August 27, 2025
ఇది కూడా చూడండి: BIG BREAKING: వైష్ణోదేవి యాత్రలో తీవ్ర విషాదం.. 30 మందికి పైగా మృతి