/rtv/media/media_files/2025/05/24/eJDoOZ0hcuhcv6U1SpzG.jpg)
Palnadu Murder
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం బోదలవీడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేతలు వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు మృతి చెందారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వీరిని స్కార్పియో ఢీకొట్టడంతో మృతి చెందారు. అయితే వీరు యాక్సిడెంట్‌లో మృతి చెందలేదని, హత్య చేసినట్లు తేలింది. బైక్‌పై వెళ్తున్న వారిని ఢీకొట్టి, కొడవలి అయితే వీరి హత్యకు ముఖ్య కారణం ఆధిపత్య పోరే అని తెలుస్తోంది.
పల్నాడు బ్రేకింగ్ న్యూస్ 🚨🚨
— Bhaskar Reddy (@chicagobachi) May 24, 2025
మాచర్లలో ఇద్దరు టీడీపీ కార్యకర్తల హత్య
బోధిలవీడు వద్ద బ్లాక్ స్కార్పియో వాహనంతో గుద్ది ఇద్దరిని చంపారు
చనిపోయిన వారు,చంపిన వారు ఇద్దరు టీడీపీ పార్టీకి చెందిన వారే#saveapfromtdp pic.twitter.com/6h6WMelk3u
ఇది కూడా చూడండి: Ind Vs Eng: రోహిత్ వారసుడిగా గిల్.. ఇంగ్లాండ్ టూర్ కోసం టెస్టు జట్టును ప్రకటించిన బీసీసీఐ!
వర్గాల మధ్య గొడవలే..
గత ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ, వైసీపీ మధ్య కాస్త గొడవలు ఉన్నాయి. ఈ సమయంలో వైసీపీకి చెందిన చింతా శివరామయ్య వర్గం టీడీపీకి చెందిన తోట చంద్రయ్యను గ్రామంలో అందరూ చూస్తుండగానే దారుణంగా హత్య చేశారు. చంద్రయ్య కుమారుడికి చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నట్లు ఇటీవల నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడా చూడండి: Crime: రూ.25 వేల అప్పు కోసం 12 ఏళ్ల బాలుడు బలి.. చంపి పాతరేశారు
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పల్నాడులో టీడీపీలోనే రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఇందులో ఒక వర్గానికి తోట వెంకట్రామయ్య నాయకుడిగా ఉండగా ఇంకో వర్గానికి జెవిశెట్టి వెంకటేశ్వర్లు ఉన్నాడు. అయితే గతంలో వైసీపీలో ఉన్న శ్రీను అనే వ్యక్తి తోట వెంకట్రామయ్యతో కలిసి టీడీపీలో చేరాడు.
ఇది కూడా చూడండి: MLC Kavitha: కవిత చెప్పిన ఆ దెయ్యాలు ఈ ముగ్గురేనా?.. వారికి కవిత అంటే ఎందుకు కోపం?
ఇంతలో ఎమ్మెల్యే బ్రహ్మా రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా జెవిశెట్టి వెంకటేశ్వర్లు ఆ గ్రామంలో ఫ్లెక్స్‌లు కట్టాడు. ఈ క్రమంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన శ్రీనుపై వెంకటేశ్వర్లు వర్గం దాడి చేసి కాలు విరగొట్టింది. తమ వర్గమైన శ్రీనుపై వెంకటేశ్వర్లు దాడి చేయడంతో వెంకట్రామయ్య వర్గం తట్టుకోలేకపోయిది. దీంతో ప్లాన్ వేశారు. ఈ రోజు వెంకటేశ్వర్లు, కోటేశ్వరావులు ఫంక్షన్‌కి వెళ్లి వస్తుండగా కొడవలితో నరికి చంపేశారు.
ఇది కూడా చూడండి: Kodali Nani: ఎట్టకేలకు బయటకు వచ్చిన కొడాలి నాని.. వివాహ వేడుకకు హాజరు.. ఫొటోలు, వీడియోలు వైరల్!
palnadu | factionalism | TDO Leaders | latest-telugu-news