CM Chandrababu : పల్నాడు గడ్డపై వైసీపీకి సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

పల్నాడు జిల్లా మాచర్ల సభలో సీఎం చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం మాట్లాడుతూ...  పల్నాడులో రౌడీయిజం చేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.

New Update
cm chandrababu

పల్నాడు(palnadu) జిల్లా మాచర్ల సభలో సీఎం చంద్రబాబు(cm chandrababu) సంచలన కామెంట్స్ చేశారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం మాట్లాడుతూ...  పల్నాడులో రౌడీయిజం చేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. తాను 2014 సీఎంను కాదు.. 1995 నాటి సీఎంను అని గుర్తుచేశారు. మాచర్లకు స్వాతంత్ర్యం వచ్చింది. అందరిలోనూ సంతోషం కనిపిస్తోంది. ఇది శాశ్వతం కావాలన్నారు సీఎం. ఎక్కడో రాజీవ్ గాంధీ హత్య జరిగితే.. మాచర్లలో రౌడీలు విధ్వంసం సృష్టించారని సీఎం గుర్తుచేశారు. మొన్నటి వరకూ ఇక్కడ ప్రజాస్వామ్యంగా ఎన్నికలు లేవన్న సీఎం..  కొందరు డిక్టేటర్లు ఉన్నారు. ప్రవర్తన మార్చుకోకపోతే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. 

Also Read :  గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం....స్పాట్ లో 30 మంది..

చెత్త రాజకీయాలను కడిగేస్తా

గత ప్రభుత్వం చెత్త మీద పన్ను వేసింది కానీ చెత్తను తొలగించలేదన్నారు సీఎం చంద్రబాబు. తాము వస్తూనే చెత్త మీద పన్ను తొలగించామని,  చెత్తను కూడా తొలగించామని అన్నారు. చెత్తను మాత్రమే కాదు చెత్త రాజకీయాలను కడిగేస్తానని చెప్పుకొచ్చారు సీఎం. మాచర్లలో చాలాకాలం ప్రజాస్వామ్యం లేదన్నారు సీఎం చంద్రబాబు. కొందరు నేతలు రౌడీయిజంతో విధ్వంసం చేశారని,  ఇక్కడ అనేకసార్లు చాలా అరాచకాలు జరిగాయన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలపై దాడి చేశారని సీఎం మండిపడ్డారు.  రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేశానని తెలిపారు చంద్రబాబు. 

Also Read :  అన్నమయ్య జిల్లా లో తీవ్ర విషాదం..వరదల్లో కొట్టుకుపోయిన చిన్నారి..పలువురు మృతి

Advertisment
తాజా కథనాలు