Palnadu : లండన్ లో పల్నాడు యువకుని మృతి!
పల్నాడు జిల్లా కోనూరు గ్రామానికి చెందిన గుంటుపల్లి సాయిరాం ఈ నెల 2వ తేదీన లండన్ లో మరణించినట్లు అధికారులు సమాచారం అందించారు. లండన్ లోని పాకిస్థాన్ పోర్ట్ బీచ్ లో సాయిరాం మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
Andhra Pradesh: ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ.. ఆ జిల్లాలో పోలీసులు హైఅలర్ట్..
ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు నెలకొన్న పల్నాడు జిల్లాలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రేపటి కౌంటింగ్ కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలుచేశారు.
AP: హై అలర్ట్ .. కౌంటింగ్ కేంద్రం వద్ద డ్రోన్లతో ప్రత్యేక నిఘా..!
పల్నాడు జిల్లాలో పోలీస్ అధికారులు హై అలర్ట్ అయ్యారు. కౌంటింగ్ సమయంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరింత అప్రమత్తమయ్యారు. నరసరావుపేట మండలం కాకాని జేఎన్టీయూ కాలేజ్ కౌంటింగ్ కేంద్రం వద్ద డ్రోన్లతో ప్రత్యేక నిఘా పెట్టారు.
Police : ఈ జిల్లాలో 150 సమస్యాత్మక గ్రామాలు.. 1666 మంది ట్రబుల్ మాంగర్స్.. 150 కేసులు: SP
పల్నాడు జిల్లాలో 150 సమస్యాత్మక గ్రామాలు గుర్తించామన్నారు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్. మాచర్ల, నరసరావుపేటలో ఎక్కువ అరెస్టులు చేశామన్నారు. కౌంటింగ్ సెంటర్లో మాత్రమే కాకుండా సమస్యాత్మక గ్రామాలలో కూడా భారీ బందోబస్తు ఉంటుందని వెల్లడించారు.
EVM : ఈవీఎంలను ధ్వంసం చేసిన పిన్నెల్లి... బయటకు వచ్చిన సీసీ ఫుటేజీలు!
ఏపీలో ఈ నెల 13న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన ఆరాచకాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం (202) లోకి వెళ్లిన పిన్నెల్లి, అక్కడ ఈవీఎం ఎత్తి నేలకేసి కొట్టడంతో వీవీ ప్యాట్ మిషన్ను ధ్వంసం చేశారు.
Pinnelli Brothers : అజ్ఞాతంలోకి పిన్నెల్లి సోదరులు?
ఎన్నికల తరువాత ఏపీలో పల్నాడులో జరిగిన అల్లర్ల నేపథ్యంలో గృహ నిర్బంధంలో ఉన్న వైసీపీ నేత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది.
Andhra Pradesh : మన చరిత్ర ఏంటో ప్రపంచం చూసింది.. హింసాత్మక ఘటనలపై హైకోర్టు ఆవేదన
ఏపీలో ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన న్యాయస్థానం.. పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్ర ప్రజలకే కాదు ప్రపంచానికే చూపించామంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
Guntur : వైసీపీ-టీడీపీ కార్యకర్తల ఇళ్లలో పెట్రోల్ బాంబులు.. దాడుల కుట్రల వెనుక..
పల్నాడు జిల్లాలో పెట్రోల్ బాంబులు బయటపడ్డాయి. టీడీపీ, వైసీపీకి చెందిన కార్యకర్తల ఇళ్లపైన గాజు సీసాలు, రాళ్ల బస్తాలను గుర్తించారు పోలీసు అధికారులు. వాటిని స్వాధీనం చేసుకుని ఏడుగురును అరెస్ట్ చేశారు. అయితే, ఇప్పటికే పల్నాడులో 144 సెక్షన్ విధించిన సంగతి తెలిసిందే.