/rtv/media/media_files/2025/09/15/married-woman-dies-after-medical-treatment-is-delayed-2025-09-15-07-18-16.jpg)
Married woman dies after medical treatment is delayed
Palnadu Crime : ఏపీలోని పల్నాడు జిల్లా పట్టణంలో ఘోరం జరిగింది. ఓ నర్సింగ్ హోమ్‌లో వైద్యం వికటించడంతో వివాహిత మృతి చెందింది. దీంతో మృతురాలి బంధువులు ఆందోళనకు దిగడంతో పాటు ఆసుపత్రి పై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. ఆసుపత్రి ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం పేదనెమలిపురి గ్రామానికి చెందిన అంకాల భూలక్ష్మి అనే వివాహిత శుక్రవారం తన ఇంట్లో బట్టలు ఉతుకుతుండగా బకెట్లో కనిపించని కీటకం ఏదో కుట్టింది. దీంతో అనుమానంతో చికిత్సకోసం పిడుగురాళ్లలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అందించిన అనంతరం ఇంటికి తీసుకెళ్లారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో దారుణం.. రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హ*త్య
అయితే శనివారం రోజు భూలక్ష్మి తనకు తల నొప్పిగా ఉందని చెప్పడంతో బంధువులు ఆమెను పిడుగురాళ్లలోని విజయ నర్సింగ్ హోమ్ కు తీసుకెళ్లారు.అయితే వైద్యులు చికిత్స అందించిన అనంతరం భూ లక్ష్మి కోలుకుంది. అయితే ఆసుపత్రిలో ఉన్న భూలక్ష్మి ఆసుపత్రిలో చేరిన తర్వాత శనివారం సాయంత్రం నుండి ఆదివారం సాయంత్రం ఆరోగ్యంగానే ఉందని, అందరితో మాట్లాడుతూనే ఉందని బంధువులు తెలిపారు. ఆ తర్వాత కాంపౌండర్ ఏదో ఇంజక్షన్ ఇస్తున్న సమయంలోనే ఎగస్వాసతో భూలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్న భూలక్ష్మి వైద్యుల నిర్లక్ష్యం మూలాంగానే చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. భూలక్ష్మి చనిపోయిన వెంటనే డాక్టర్లు వైద్య సిబ్బంది ఆసుపత్రి నుండి పరారయ్యారు. దీంతో బంధువులు ఆగ్రహంతో ఆసుపత్రి అద్దాలు పగలగొట్టి ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు.
ఇది కూడా చదవండి:ఏపీలో దారుణం.. భార్యను రోకలి బండతో హత్య చేసి గొంతు కోసుకున్న భర్త