/rtv/media/media_files/2025/02/15/TZuE8wCRjwBcb1wsufaV.jpg)
accident
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వినుకొండ మండలం శివాపురం వద్ద లారీని మినీ లారీ గట్టిగా ఢీకొట్టింది. ఇవాళ (మంగళవారం) ఉదయం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను వెంటనే సమీప హాస్పిటల్‌కు తరలించారు.
Also Read: మీడియా ముందు బయటపడ్డ దొంగ పాక్.. పుల్వామా అటాక్ కూడా మేమే
మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి
కాగా ఈ ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ స్పందించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలిచ్చారు. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందడం విచారకరం అని అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Also Read: కాల్పుల విరమణ తర్వాత మోదీ ఫస్ట్ ట్వీట్.. ఏమన్నారంటే?
మరో విషాదం
ఇదిలా ఉంటే ఇవాళ మరో విషాదం చోటుచేసుకుంది. న్యూయార్క్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో క్లీవ్‌ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు మరణించారు. ఈ సంఘటనపై న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ సంతాపం వ్యక్తం చేసింది. మరణించిన విద్యార్థులను మానవ్ పటేల్ (20), సౌరవ్ ప్రభాకర్ (23) గా గుర్తించారు.
Also Read: కాల్పుల విరమణలో వీళ్లే కీలకం.. ఇరు దేశాల DGMO గురించి మీకు తెలుసా?
మే 10న పెన్సిల్వేనియాలో ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు విద్యార్థులు వెళ్తున్న కారు వంతెనను ఢీకొట్టడంతో ఇద్దరూ మరణించారు. ఈ ప్రమాదంలో వాహనం ముందు సీటులో ఉన్న మరో ప్రయాణీకుడు గాయపడగా, అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రభాకర్ వాహనాన్ని నడుపుతున్నాడని పోలీసులు వెల్లడించారు. ఇద్దరు విద్యార్థులు సంఘటనా స్థలంలోనే మరణించారని తెలిపారు.
Also Read: ఆపరేషన్ సిందూర్‌ను ఆపలేదు.. ఎయిర్ ఫోర్స్ సంచలన ప్రకటన!
న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ ఈ ప్రమాదం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, విద్యార్థులు క్లీవ్‌ల్యాండ్ స్టేట్ యూనివర్శిటీలో చదువుకోడానికి వచ్చారని వెల్లడించింది. మృతుల కుటుంబాలతో కాన్సులేట్ సంప్రదింపులు జరుపుతున్నామని.. వారికి అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు.
palnadu | palnadu crime | latest-telugu-news | telugu-news