Mohammad Rizwan: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్..ఇవే తగ్గించుకుంటే మంచిది!
రిజ్వాన్ 38 బంతుల్లో 36 పరుగులు చేసి షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో సహనం కోల్పోయిన రిజ్వాన్ డగౌట్‌లోకి తిరిగి వెళ్లే క్రమంలో కోపంతో తన హెల్మెట్‌ను నేలకేసి విసిరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Pakistan PM: యుద్ధానికి సిద్ధం సైన్యానికి సెలవులు రద్దు.. పాకిస్థాన్ కీలక ప్రకటన
భారత్ సిందూ ఒప్పందం రద్దు చేయడమంటే యుద్ధం ప్రకటించడమే అంటూ పాక్ పేర్కొంది. పాక్ ప్రధాన మంత్రి గురువారం అత్యవసర సమావేశం నిర్వహించారు. పాక్ సైన్యానికి సెలవులు రద్దు చేసింది. భారత్ దాడి చేస్తే.. తిప్పికొట్టాలని ఆర్మీని ఆదేశించింది.
Pakistan : సింధు నదిలోప్రతీ నీటి చుక్కా మాదే: పాకిస్తాన్ సంచలన ప్రకటన
సింధు జలాల్లోని ప్రతీ నీటి బొట్టుపై తమకు హక్కు ఉందన్నారు పాకిస్తాన్ మంత్రి అవైస్ అహ్మద్ ఖాన్. భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము న్యాయపరంగా, దౌత్యపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిర్లక్ష్యంగా నిలిపివేయడం పిరికితనమని అన్నారు.
సర్జికల్ స్ట్రైక్ అంటే ఏంటి..? త్రివిధ దళాల మెరుపు దాడుల్లో వీళ్లే మెనగాళ్లు
ప్లాన్ ప్రకారం టార్గెట్‌ను నాశనం చేయడమే సర్టికల్ స్ట్రైక్. భారత్ ఉగ్రవాదులపై 2016లో ఆర్మీతో, 2019లో ఎయిర్ ఫోర్స్‌తో సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఆర్మీలో పారా కమాండోలు, నేవీలో చెందిన మార్కోస్, ఎయిర్ ఫోర్స్‌లో గరుడ సర్జికల్ స్ట్రైక్స్‌కు పెట్టింది పేరు.
Marriage cancel : ఉగ్రదాడి ఎఫెక్ట్.. పాపం పాకిస్థాన్ అమ్మాయితో పెళ్లి క్యాన్సిల్!
రాజస్థాన్ కు చెందిన షాతన్ సింగ్ అనే వ్యక్తికి పాకిస్థాన్ కు చెందిన ఓ హిందూ యువతితో ఏప్రిల్ 24న పెళ్లి ఫిక్స్ అయింది. అయితే తాజాగా పాక్ తో పూర్తిగా సంబంధాలు తెంచుకోవడంతో వాఘా- అట్టారి బార్డర్ మూసివేయగా అక్కడకు వెళ్లలేక పెళ్లి ఆగిపోయింది.
Pahalgam terror attack: ఏ క్షణమైనా భారత్ -పాక్ యుద్ధం.. వేగంగా మారుతున్న పరిణామాలు?
సరిహద్దులో ఆయుధాలు కదులుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఒప్పందాలు రద్దైపోతున్నాయి. పాక్, భారత్‌ల మధ్య దౌత్య సంబంధాలు తెగిపోయాయి. అటు పాక్ ఇండియా బార్డర్లో మిస్సేల్ టెస్ట్ చేస్తోంది. ఈ పరిస్థితులు అన్నీ చూస్తోంటే ఇరు దేశాల మధ్య యుద్ధం తప్పదేమో అనిపిస్తోంది.
BIG BREAKING : ఇకపై పాకిస్తాన్‌తో ఎలాంటి మ్యాచ్‌లు ఉండవు : బీసీసీఐ
బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్‌తో భారత్ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. ఐసీసీ కారణంగానే పాక్‌తో తటస్థ వేదికల్లో ఆడుతున్నట్లు రాజీవ్ శుక్లా వెల్లడించారు.
Pakistan army chief: పుల్వామా నుంచి పహల్గామ్ అటాక్ వరకు.. మొత్తం చేసింది వాడే!!
భారత్‌పై అనేక ఉగ్రదాడుల వెనుక ప్రస్తుత పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. 2018 నుంచి ఆయన ISIగా బాధ్యతలు సీకరించిన ఏడాదికే పుల్వామా దాడి జరిగింది. పహల్గామ్ అటాక్‌కు 3రోజుల ముందు కూడా అసీమ్ ఉగ్రవాదులను రెచ్చగొట్టే వాఖ్యలు చేశాడు.