OPERATION SINDOOR: ఆపరేషన్ సింధూర్.. యూపీలో రెడ్ అలర్ట్

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడి తర్వాత ఉత్తరప్రదేశ్‌లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. భద్రత దృష్ట్యా రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు యూపీ డీజీపీ వెల్లడించారు.

New Update

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడికి పాల్పడింది. ఈ దాడిలో 90 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఈ దాడి తర్వాత ఉత్తరప్రదేశ్‌లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. భద్రత దృష్ట్యా రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు తెలుస్తోంది. అన్ని  పోలీసు క్షేత్ర విభాగాలు రక్షణ విభాగాలతో సమన్వయం చేసుకోవాలని యూపీ డీజీపీ వెల్లడించారు.

ఇది కూడా చూడండి: Operation Sindoor : పాక్‌పై దాడుల వేళ...నేడు CCS తో ప్రధాని మోదీ కీలక భేటీ

ఇది కూడా చూడండి: BIG BREAKING : భారత్ దాడి చేసిన 9 ప్రాంతాలివే.. లష్కరే తోయిబా కంచుకోట ఖతం!

ఇదిలా ఉండగా పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ దాడులు చేసింది. ఇప్పటివరకు 90 మంది ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. ఈ విషయాన్ని పాక్ మీడియా కూడా ధ్రువీకరించింది. పాకిస్తాన్ లోని బహవల్ పూర్ లోని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ హెడ్ క్వార్టర్స్,  జైషే మహ్మద్ కు చెందిన మదర్సాలో ఉగ్రవాదులు ఉన్నట్లు భారత ఆర్మీకి పక్కా సమాచారం అందింది. 

ఇది కూడా చూడండి: BIG BREAKING : పాక్ దాడి.. ముగ్గురు భారత పౌరులు మృతి!

దీంతో ఆ ప్రాంతాల్లో భారత ఆర్మీ దాడులు చేసింది. దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది. అయితే ఉగ్రవాద శిబిరాల మీద తప్ప పాక్ సైన్యం మీద అటాక్ చేయలేదని ఇండియన్ ఆర్మీ స్పష్టం చేసింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు