Operation Sindoor : భారత్‌ దాడి చేసిన ఉగ్రస్థావరాలు ఇవే...

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రధాన చర్య తీసుకుంటూ, భారతదేశం మంగళవారం రాత్రి 1.30 గంటలకు 9 ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడి చేసింది. భారత బలమైన దళాలు పాకిస్తాన్‌లోని 4 ప్రదేశాలను మరియు పీఓకేలోని 5 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నాయి.

New Update
Operation Sindoor
Operation Sindoor

: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌ ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో పాక్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ దాడులు చేసింది.  పాక్‌ను ఏమార్చి దెబ్బకొట్టిన భారత ప్రధాని. బాలాకోట్‌ దాడుల తరహాలో నరేంద్రమోదీ వ్యూహం పన్నారు. దాడికి ముందు భారత్‌లో  ప్రశాంత వాతావరణం ఉన్నట్లుగా కనిపించేలా  వ్యూహం రచించారు. పాకిస్థాన్‌ ఏమరపాటుగా ఉన్న వేళ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది.

కాగా భారత్‌ దాడుల నేపథ్యంలో  సరిహద్దు జిల్లాల పరిస్థితిని జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్‌ పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని లెఫ్టినెంట్ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ప్రకటించారు.సరిహద్దు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. అవసరమైన ఆహారం, రవాణా సదుపాయాలు కల్పించాలని సూచించారు.  

కాగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రధాన చర్య తీసుకుంటూ, భారతదేశం మంగళవారం రాత్రి 1.30 గంటలకు 9 ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడి చేసింది. ఈ దాడికి 'ఆపరేషన్ సిందూర్' అని పేరు పెట్టారు. ఇది మూడు సైన్యాల ఉమ్మడి ఆపరేషన్. భారత బలమైన దళాలు పాకిస్తాన్‌లోని 4 ప్రదేశాలను మరియు పీఓకేలోని 5 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే...

1. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ దూరంలో ఉన్న బహవల్‌పూర్‌లో ఉన్న జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం. 2.సాంబా-కతువా ఎదురుగా అంతర్జాతీయ సరిహద్దుకు 8 కి.మీ దూరంలో ఉన్న సర్జల్ క్యాంప్. ఇది జేఎంకు ఒక క్యాంప్. 3. మురిడ్కే, సాంబా ఎదురుగా సరిహద్దుకు 30 కి.మీ దూరంలో ఉన్న లష్కరే క్యాంప్‌ 4. సరిహద్దు నియంత్రణ రేఖ పూంఛ్‌- రాజౌరీకి 35 కి.మీ దూరంలో ఉ్న గుల్పూర్‌. 5. అంతర్జాతీయ సరిహద్దు కు 15 కిమీ దూరంలో సియాల్‌కోట్ సమీపంలో ఉన్న హెచ్‌ఎం శిక్షణా శిబిరం మెహమూనా క్యాంప్.6. పాక్‌ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌లోని తంగ్ధర్ సెక్టార్ లోపల 30కి.మీ పరిధిలో ఉన్న సవాయ్‌ లష్కరే క్యాంప్‌7. రాజౌరీకి ఎదురుగా నియంత్రణ రేఖకు 10.కి.మీ పరిధిలో ఉన్న బర్నాలా క్యాంప్‌. 8.రాజౌరీకి ఎదురుగా నియంత్రణ రేఖకు 15 కి.మీ.ల దూరంలో ఉన్న జేఎం లాంచ్‌ప్యాడ్‌ బిలాల్‌ క్యాంప్‌. 9.జేఎం లాంచ్‌ప్యాడ్‌ బిలాల్‌ క్యాంప్‌ లు ఉన్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు