పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఆపరేషన్ సిందూర్‌తో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. బుధవారం అర్థరాత్రి సమయంలో పాక్ ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడులు చేసింది. ఈ దాడుల్లో 90 మంది ఉగ్రవాదులు మృతి చెందారు. అయితే ఆపరేషన్ సిందూర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. సెలవులో ఉన్న పారా మిలిటరీ బలగాలను వెనక్కి రప్పించమని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇది కూడా చూడండి: Operation Sindoor : పాక్‌పై దాడుల వేళ...నేడు CCS తో ప్రధాని మోదీ కీలక భేటీ
भारत ने पैरामिलिट्री सेनाओं के सभी जवानों और अधिकारियों की छुट्टी रद्द की #OperationSindoor | #IndianArmy | #IndianAirForce |
— News24 (@news24tvchannel) May 7, 2025
Masood Azhar | Operation Sindoor | Paramilitary Forces pic.twitter.com/y2hLMcv6zM
ఇది కూడా చూడండి: BIG BREAKING : భారత్ దాడి చేసిన 9 ప్రాంతాలివే.. లష్కరే తోయిబా కంచుకోట ఖతం!
ఆర్మీ బలగాలను చూస్తూ గర్విస్తున్నా..
ఇదిలా ఉండగా ఈ ఆపరేషన్ సిందూర్‌పై అమిత్ షా స్పందించారు. భారత్ ప్రజలపై దాడి చేస్తే నరేంద్ర మోదీ ప్రభుత్వం తగిన విధంగా బుద్ధి చెబుతుందంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత బలగాలు ఆపరేషన్ సిందూర్ చేపట్టాయని వెల్లడించారు. ఆర్మీ బలగాలను చూసి గర్విస్తున్నానని పోస్టు పెట్టారు అమిత్ షా. మరోవైపు ‘మన సాయుధ దళాలను చూసి గర్విస్తున్నా. జై హింద్’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోస్టు పెట్టారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: పాక్ పై భారత్ మెరుపు దాడి.. 30కి పైగా ఉగ్రవాదులు హతం!
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ‘ప్రపంచం ఉగ్రవాదాన్ని సహించకూడదు’ అని భారత విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ పోస్టు చేశారు. ఆపరేషన్ సిందూర్‌తో భారత బలగాలు పహల్గాం ఉగ్రదాడికి దీటైన జవాబు ఇచ్చాయని బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా అన్నారు. భారత గడ్డపై దాడి చేసిన వారికి కఠిన శిక్ష విధిస్తామని నరేంద్రమోదీ చెప్పిన విషయాన్ని నడ్డా గుర్తు చేశారు. ఉగ్రవాదం అనే పీడను విరగడ చేస్తామని నడ్డా తెలిపారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING : పాక్ దాడి.. ముగ్గురు భారత పౌరులు మృతి!