/rtv/media/media_files/2025/05/07/MWeUhtpNOyjhmLfTX52d.jpg)
central video
పహల్గామ్ దాడి అత్యంత హేయమైనదని విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నారు. కశ్మీర్ లో శాంతిని భగ్నం చేసేందుకు జరిగిన కుట్ర అని, కశ్మీర్ ను అతలాకుతలం చేసేందుకు ఈ దాడి జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆపరేషన్ సిందూర్ పై ఢిల్లీలో జరిగిన త్రివిధ దళాల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న వారిని ఇంటెలిజెన్స్ గుర్తించిందని... ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన వివరాల ఆధారంగా నిందితులను గుర్తించామని వెల్లడించారు. కశ్మీర్ లో అభివృద్ధిని అడ్డుకోవడమే ఉగ్రవాదుల పన్నాగమని తెలిపారు. పహల్గామ్ ఉగ్రవాద దాడితో పాటుగా పార్లమెంట్ పై దాడి, ముంబైలో కాల్పులు దాడి, 2019లో పుల్వామా ఉగ్రవాద దాడులను హైలైట్ చేస్తూ భారత ప్రభుత్వం ఒక వీడియోను విడుదల చేసింది. ఈ దాడుల వలన ఇప్పటివరకు పాక్ ఉగ్రదాడుల్లో 350 మంది భారత పౌరులు మృతి చెందారని వెల్లడించారు.
NOW: Briefing on #OperationSindoor
— TIMES NOW (@TimesNow) May 7, 2025
Ahead of the press briefing, the government releases a video highlighting past terror attacks on India, including the Pahalgam terror attack.
Watch LIVE: https://t.co/01G4Ar9gvWpic.twitter.com/TuuAKcLNnu
ఉగ్రవాదులకు పాకిస్తాన్ అండగా
ఉగ్రవాదులకు పాకిస్తాన్ అండగా నిలుస్తుందని విక్రమ్ మిస్రీ అన్నారు. ఈ ఉగ్రదాడి వెనుక లాష్కరే తోయిబా కుట్ర ఉందన్న ఆయన... లాష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ ఈ దాడి చేసిందని తెలిపారు. దాడి చేశామని సోషల్ మీడియాలో టీఆర్ఎఫ్ ప్రకటించిందని.. ఉగ్రవాదులకు పాకిస్తాన్ అండగా నిలుస్తుందనే పాకిస్తాన్ పై దౌత్య, వాణిజ్య పరమైన ఆంక్షలు విధించామని ఆయన వెల్లడించారు. చాలా కాలం నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తుందని చెప్పుకొచ్చారు.