Amit Shah : ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలిస్తాం: అమిత్‌ షా సంచలన ట్వీట్ !

భారత్, ప్రజలపై దాడి చేస్తే నరేంద్ర మోదీ ప్రభుత్వం తగిన విధంగా బుద్ధి చెబుతుందంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ట్వీట్ చేశారు.  పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత బలగాలు ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టాయని వెల్లడించారు.

New Update
Amit Shah

Amit Shah

భారత్, ప్రజలపై దాడి చేస్తే నరేంద్ర మోదీ ప్రభుత్వం తగిన విధంగా బుద్ధి చెబుతుందంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ట్వీట్ చేశారు.  పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత బలగాలు ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టాయని వెల్లడించారు.  ఆర్మీ బలగాలను చూసి గర్విస్తున్నానని పోస్టు పెట్టారు అమిత్ షా. మరోవైపు ‘మన సాయుధ దళాలను చూసి గర్విస్తున్నా. జై హింద్‌’ అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పోస్టు పెట్టారు.  ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో ‘ప్రపంచం ఉగ్రవాదాన్ని సహించకూడదు’ అని  భారత విదేశాంగశాఖ మంత్రి జై శంకర్‌ పోస్టు చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌తో భారత బలగాలు పహల్గాం ఉగ్రదాడికి దీటైన జవాబు ఇచ్చాయని  బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా అన్నారు.  భారత గడ్డపై దాడి చేసిన వారికి కఠిన శిక్ష విధిస్తామని నరేంద్రమోదీ చెప్పిన విషయాన్ని నడ్డా గుర్తు చేశారు.  ఉగ్రవాదం అనే పీడను విరగడ చేస్తామని నడ్డా తెలిపారు.  

Advertisment
తాజా కథనాలు