/rtv/media/media_files/2025/05/07/iOugnK2gL3LFlePRvaip.jpg)
indigo flight bomb
పహల్గామ్‌లో జరిగిన పిరికిపంద ఉగ్రవాద దాడికి పాకిస్తాన్, దాని ఉగ్రవాదులపై భారత్ ఎట్టకేలకు ప్రతీకారం తీర్చుకుంది. మే 7వ తేదీ బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ప్రదేశాలపై భారత్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో 90 మంది ఉగ్రవాదులు మరణించారు.
Mumbai Airport Closure on May 8: Chhatrapati Shivaji Maharaj International Airport To Remain Shut for 6 Hours for Pre-Monsoon Runway Maintenance, Check Passenger Advisory#MumbaiAirport #ChhatrapatiShivajiMaharajAirport #Monsoon2025 @CSMIA_Official
— LatestLY (@latestly) May 7, 2025
ఈ క్రమంలోనే ముంబైలోని సహార్ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఇండిగో విమానంలో బాంబు పెట్టామని ఒక అజ్ఞాత వ్యక్తి హెచ్చరించాడు. వెంటనే అప్రమత్తమై అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. విమానాశ్రయ హాట్‌లైన్‌కు ఫోన్ కాల్ ద్వారా ఈ బెదిరింపు వచ్చిందని అధికారులు తెలిపారు. దీనితో విమానాశ్రయం, భద్రతా అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతానికి విమానంలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు ఏవీ కనిపించలేదని అధికారులు అంటున్నారు. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత వైమానిక దాడులు చేసిన కొద్దిసేపటికే ఈ సంఘటన చోటుచేసుకోవడంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. బెదిరింపు కాల్ ఎక్కడినుంచి వచ్చిందో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.