OPERATION SINDOOR : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు చేసింది. భారతదేశం బుధవారం తెల్లవారుజామున 1.30 గంటలకు 9 ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడి చేసింది. ఈ దాడికి 'ఆపరేషన్ సిందూర్' అని పేరు పెట్టారు. భారత దళాలు పాకిస్తాన్‌లోని 4 ప్రదేశాలను,పీఓకేలోని 5 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయి. ఈ దాడుల్లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది.
కాగా భారత్ దాడులతో కోపంగా ఊగిపోతున్న పాక్ ఏం చేయాలో దిక్కతోచని పాక్ కవ్వింపు చర్యలు పెంచింది. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని ఐక్యరాజ్యసమితి ఆస్తులను లక్ష్యంగా చేసుకున్న పాక్ దాడులు చేసింది. దిక్కుతోచని స్థితిలో దాయాది దేశం ఐక్యరాజ్యసమితి కార్యాలయలపై దాడులకు తెగబడింది. ఐక్యరాజ్యసమితి ఫీల్డ్ స్టేషన్ వైపు పాక్ ప్రయోగించిన ఫిరంగి గుండ్లు దూసుకొచ్చాయి. వీటితో ప్రాణ నష్టం జరగనప్పటికీ అవి పూంఛ్‌లో గేటు వెలుపల అవి పడిపోయినట్లు సమాచారం.
కాగా పాకిస్థాన్ చర్యలను ఐరాస నిషితంగా గమనిస్తోంది. మొదటి నుంచి రెండు దేశాలు శాంతి యుత వాతావరణాన్ని పెంపొందించాలని కోరుతున్న ఐక్యరాజ్యసమితి ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాలి,