Operation Sindoor : పాక్‌ను ఏమార్చి దెబ్బకొట్టిన మోదీ.. దెబ్బ అదుర్స్ కదూ.. వీడియోలు వైరల్!

బాలాకోట్‌ దాడుల తరహాలో ముష్కరులను అంతమోదించడానికి ప్రధాని మోదీ స్కెచ్ వేశారు.  దాడికి ముందు భారత్ లో ప్రశాంత వాతావరణం ఉన్నట్లుగా చూపించి..  పాకిస్థాన్‌ ఏమరపాటుగా ఉన్న వేళ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది.  

New Update

పహల్గామ్ ఉగ్రదాడి భారత ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలను రగిల్చింది. ముష్కరుల ఘాతుకానికి తగిన బదులు చెప్పాలని ప్రతి భారతీయుడు కోరుకున్నాడు. గతంలో బాలాకోట్ పై అటాక్ చేసినట్లుగానే అర్ధరాత్రి భారత సైన్యం పాక్ ఉగ్రవాదులపై మెరుపు దాడులు చేపట్టింది. ఉగ్రస్థావరాలే లక్ష్యంగా మిసైల్స్ తో విరుచుకుపడింది. ఈ చర్యతో భారత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత్ దెబ్బ అదుర్స్ అంటూ సోషల్ మీడియాలో  పోస్టులు చేస్తున్నారు. బాలాకోట్‌ దాడుల తరహాలో ముష్కరులను అంతమోదించడానికి ప్రధాని నరేంద్ర మోదీ స్కెచ్ వేశారు.  దాడికి ముందు భారత్ లో ప్రశాంత వాతావరణం ఉన్నట్లుగా చూపించి..  పాకిస్థాన్‌ ఏమరపాటుగా ఉన్న వేళ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది.  యుద్ధానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.  

Advertisment
Advertisment
తాజా కథనాలు