OPERATION SINDOOR: భారత్ ప్రతీకారం కరెక్టే.. సపోర్ట్‌గా నిలిచిన ఇజ్రాయెల్

భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్ సింధూర్‌‌కు ఇజ్రాయెల్ పూర్తి మద్ధతు తెలిపింది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసే హక్కు ఉందని ఇజ్రాయెల్ అంబాసిడర్ ర్యూవెన్ అజర్ తెలిపారు. అమాయకులపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు జీవించే హక్కు లేదన్నారు.

New Update

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్‌ పేరుతో పాక్ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. ఈ మెరుపు దాడుల్లో 90 మంది ఉగ్రవాదులు ఇప్పటి వరకు హతం అయ్యారు. అయితే భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్ సింధూర్‌‌కు ఇజ్రాయెల్ పూర్తి మద్ధతు తెలిపింది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసే హక్కు ఉందని ఇజ్రాయెల్ అంబాసిడర్ ర్యూవెన్ అజర్ సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేశారు. అమాయకులపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు జీవించే హక్కు లేదన్నారు. దీనికి #OperationSindoor అనే హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు. 

ఇది కూడా చూడండి:Operation Sindoor : పాక్‌పై దాడుల వేళ...నేడు CCS తో ప్రధాని మోదీ కీలక భేటీ

ఇది కూడా చూడండి:BIG BREAKING : భారత్ దాడి చేసిన 9 ప్రాంతాలివే.. లష్కరే తోయిబా కంచుకోట ఖతం!

ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసి..

ఇదిలా ఉండగా.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రధాన చర్య తీసుకుంటూ మే 07వ తేదీ బుధవారం రాత్రి 1.30 గంటలకు 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడి చేసింది. ఈ దాడికి 'ఆపరేషన్ సిందూర్' అని పేరు పెట్టారు. భారత ఆర్మీ..  పాకిస్తాన్‌లోని 4 ప్రదేశాలను, పీఓకేలోని 5 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతోంది.అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ లోపు ఉన్న ఉగ్రవాదుల స్థావరాలను భారత్‌ టార్గెట్ చేసింది.  

ఇది కూడా చూడండి:BIG BREAKING : పాక్ దాడి.. ముగ్గురు భారత పౌరులు మృతి!

Advertisment
తాజా కథనాలు