India Pakistan War Latest Updates | 2 రోజుల్లో లేపేస్తాం | Indian Army Warning | Pahalgam | RTV
ప్రస్తుతం భారతదేశం చాలా సున్నితంగా ఉంది. పహల్గామ్ దాడి అందరిలోనూ ఉద్రేకాన్ని రేపింది. దీని కారణంగా కొంతమంది హద్దుమీరి చర్యలకు పాల్పడుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో కొంతమంది ఉగ్రదాడి ప్రతీకారం అంటూ ఒక అమాయకుడి ప్రాణాలు తీశారు.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాదుల చేతిలో దారుణ హత్యకు గురైన కర్నాల్ నివాసి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కుటుంబానికి హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ శనివారం (ఏప్రిల్ 26) రూ.50 లక్షల పరిహారంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రకటించారు.
పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ నుంచి కచ్చితంగా ప్రతీకార చర్య ఉంటుందని ఎలాంటి సందేహం లేదన్నారు. ఏప్రిల్ 22న పహల్గాంలో దాడి జరిగింది కాబట్టి.. మే మొదటి వారంలో లేదా మధ్యన భారత్ దాడి చేసే అవకాశం ఉందన్నారు.
పాకిస్థానీయులు వెంటనే స్వదేశానికి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో కొందరు పాకిస్థానీయులు భారత్ విడిచి వెళ్లమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్‌కు తిరిగి పంపించొద్దని చేతులు జోడించి వేడుకుంటున్నారు.
గుజరాత్లో 1000 మందికి పైగా బంగ్లాదేశీ అక్రమ వలసదారులను పోలీసులు గుర్తించారు. వాళ్లందరినీ అదుపులోకి తీసుకున్నారు. వీళ్లంతా ఫేక్ సర్టిఫికేట్లతో గుజరాత్‌లోనికి ప్రవేశించినట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి తెలిపారు. త్వరలోనే వీళ్లను దేశం నుంచి పంపిస్తామన్నారు.
మరో 48 గంటల్లో పాకిస్థాన్‌పై భారీ దాడి జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌కు మద్దతుగా రంగంలోకి ఇజ్రాయెల్ మొసాద్ టీం దిగినట్లు తెలుస్తోంది. అత్యాధునిక టెక్నాలజీ సాయం అందిస్తోందని.. పాకిస్థాన్‌లో భారీ విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌లోని బెజవాడలో పాకిస్తాన్ కాలనీ ఉందని మీలో ఎంతమందికి తెలుసు. 1980లో పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థుల కోసం విజయవాడలో పాకిస్తాన్ కాలనీ ఏర్పాటు చేశారు. వారంతా పాకిస్థానీలే కాబట్టి దానికి పాకిస్తాన్ కాలనీ అని పేరు పెట్టారు.
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాకిస్థాన్‌తో ఏ క్షణమైన యుద్ధం జరగొచ్చనే ప్రచారం నడుస్తోంది. తాజాగా ఇండియన్ ఆర్మీ సంచలన పోస్ట్ చేసింది. ఎల్లప్పుడూ సిద్ధమని పేర్కొంటూ జవాన్లు విన్యాసం చేసే దృశ్యాలను షేర్ చేసింది.