/rtv/media/media_files/2025/04/28/jlKKbA9WeSW6t7amPSWM.jpg)
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. పాక్, భారత్‌లు మిత్ర దేశాల నుంచి ఆయుధాలు తెప్పించుకుంటున్నాయి. స్వీడన్ భారతదేశానికి ఆయుధాలు పంపించింది. 2016లో POKలో ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను నాశనం చేయడానికి ఉపయోగించిన కార్ల్ గస్టాఫ్ రాకెట్ లాంచర్ లెటెస్ట్ వెర్షన్ రాకెట్ లాంచర్ల AT-4లను స్వీడన్ భారత్ కోసం పంపించింది. స్వీడన్‌కు చెందిని AT-4 తయారీ సంస్థ సాబ్ కంపెనీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
Also read: Pakistan: నీతిలేని కుక్క టర్కీ.. ఇండియా సాయాన్ని మరిచి ఇప్పుడు పాక్‌కు ఆయుధాల సరఫరా
ஸ்வீடனின் சாப் நிறுவனம் இந்திய இராணுவப் படைகளுக்கு AT4CS AST anti-armour weapon டெலிவரி செய்துள்ளது. pic.twitter.com/i1gwwrI7MN
— இராணுவச் செய்திகள் (@Defencetamil) April 28, 2025
Also read: Siddaramaiah: ముఖ్యమంత్రి ఓవరాక్షన్.. స్టేజ్ మీదే IPS చెంపపై కొట్టబోయిన (VIRAL VIDEO)
AT-4 అనేది కవచ నిరోధక ఆయుధం, దీనిని శత్రు బంకర్లను నాశనం చేయడానికి ఉపయోగిస్తారు. సైన్యానికి సరఫరా చేసిన తర్వాత, సాబ్ కంపెనీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. భారత సాయుధ దళాలకు మా AT-4 యాంటీ-ఆర్మర్ ఆయుధ వ్యవస్థను విజయవంతంగా అందజేసినట్లు ప్రకటించడానికి మేము గర్విస్తున్నామని తెలపింది. AT-4 రాకెట్ లాంచర్లు కార్ల్ గుస్టాఫ్ కంటే తేలికైనవి. టెండర్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేయబడిన AT-4 ఆయుధాలు భారత్‌కు అందించారు. యుద్ధ సమయంలో సింగిల్-షాట్‌కి ఇవి బాగా పనిచేస్తాయి. కార్ల్ గుస్టాఫ్ తో పోలిస్తే, AT-4 చాలా తేలికైన రాకెట్ లాంచర్. సైనికులు వీటిని సులభంగా భుజంపై పెట్టుకొని కాల్పులు చేయవచ్చు. తాజాగా కల్-గుస్తావ్ నుండే పారా-ఎస్ఎఫ్ కమాండోలు ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను మరియు పాకిస్తాన్ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేశారు. అక్కడ నుండి ఉగ్రవాదులు చొరబాటుకు వారు సహాయం చేస్తున్నారు.
(AT-4 weapons | sweden | india pak war | Pahalgam attack)