Pahalgam terror attack: ఉగ్రదాడిపై కొత్త అనుమానం రేపిన UP సీఎం యోగి

పహల్గామ్ టెర్రర్ అటాక్‌పై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆథిత్య నాథ్ కొత్త అనుమానాలు రేకెత్తించారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్తాన్ నుండి వచ్చారో లేదా భారతదేశంలోని వారో నాకు అర్థం కావడం లేదన్నారు. పరోక్షంగా సమాజ్ వాదీని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడారు.

New Update
Yogi: పేదలు, మహిళల జోలికొస్తే మీ పని ఖతమే.. సీఎం సీరియస్ వార్నింగ్!

పహల్గామ్ టెర్రర్ అటాక్‌పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆథిత్య నాథ్ మరో కొత్త అనుమానాలు రేకెత్తించారు. దేవరియాలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్ బైసరన్ లోయలో ఏప్రిల్ 22న 28 మంది పర్యటకులను టెర్రరిస్టులు కాల్చి చంపారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్తాన్ నుండి వచ్చారో లేదా భారతదేశానికి చెందినవారో నాకు అర్థం కావడం లేదని సీఎం యోగి అన్నారు. 

ఉగ్రవాదులు దాడిలో కాన్పూర్‌కు చెందిన శుభం ద్వివేది అనే యువకుడు చనిపోయాడు. టర్రర్ అటాక్‌లో చనిపోయిన శుభం ద్వివేది ఇంటికి వెళ్లారా అని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌ను ఓ జర్నలిస్ట్ అడిగారు. అతను మా పార్టీ కాదని ఆయన SP అధినేత అఖిలేష్‌ సమాధానం ఇచ్చారు. ఇది ఎంత దురదృష్టకరం, సిగ్గుచేటు అని యోగి మండిపడ్డారు.

Also read: Smita Sabharwal: స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్.. కర్మణ్యేవాధికారస్తే అంటూ.. !

సమాజ్‌వాదీ పార్టీ నాయకులు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని, వారు పాకిస్తాన్‌కు చెందినవారా లేదా భారతదేశానికి చెందినవారా అని అర్థం చేసుకోవడం కష్టమని ముఖ్యమంత్రి అన్నారు. ఆయన పరోక్షంగా ఉగ్రదాడి సవాజ్ వాదీ పార్టీయే చేసిందని ఆరోపించారు. పహల్గామ్ ఉగ్రదాడిపై సవాజ్‌వాది పార్టీ స్పందించిన తీరుపై ఆయన ఫైర్ అయ్యారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ కులం అంశంపై కూడా సమాజ్‌వాదీ పార్టీ వ్యాఖ్యలను నిలదీశారు.

Also read: పాకిస్తాన్‌కు మరో బిగ్ షాక్.. ఇటుగా విమానం ఎగిరితే పేల్చపడేస్తాం!

(cm-yogi-adityanath | cm-yogi-aditya-nath | up-cm-yogi-adityanath | uttara-pradesh | samajvadi-party | attack in Pahalgam | Pahalgam attack | pahalgam army operation | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు