Operation Sindoor: ఉద్యోగుల సెలవులు రద్దు.. వారంతా అరెస్ట్.. సీఎం రేవంత్ సంచలన ఆదేశాలు!
అత్యవసర సర్వీస్ లు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉద్యోగులంతా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలన్నారు.