Operation Sindoor: 100 మంది ఉగ్రవాదులను లేపేసాం: రాజ్‌నాథ్ సింగ్
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా కనీసం 100 మంది ఉగ్రవాదులను హతం చేసినట్లు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా కనీసం 100 మంది ఉగ్రవాదులను హతం చేసినట్లు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు.
భద్రతా దృష్ట్యా రాజస్థాన్‌లో 1037 కిలోమీటర్లు వరకు ఉన్న పాక్ సరిహద్దును సీల్ చేశారు. సరిహద్దుల్లో ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే కాల్చివేయాలని ప్రభుత్వం ఇండియన్ ఆర్మీకి ఆదేశాలు జారీ చేసింది. అలాగే పంజాబ్‌లోని ఆరు ప్రాంతాల్లోని పాఠశాలలను క్లోజ్ చేశారు.
ఆపరేషన్ సిందూర్‌ని పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అడ్డుకోలేక పోయింది. ఇప్పుడే కాదు గతంలో కూడా భారత్, అమెరికా దాడి చేసినప్పుడు పాక్ ఉపయోగించే చైనా నిఘూ వ్యవస్థ ఫైయిల్ అయ్యింది. భారత క్షిపణులు, డ్రోన్లు పీవోకేలోకి ప్రవేశించినా పాక్ కనిపెట్టలేకపోయింది.
ఆపరేషన్ సిందూర్ పట్ల దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ దేశభక్తి భావనతో ప్రేరణ పొంది బీహార్ రాష్ట్రంలోని కతిహార్ జిల్లాలో బాలతి మహేశ్‌పూర్ నివాసితులైన సంతోష్ మండల్, రాఖీ కుమారి తమ నవజాత కుమార్తెకు "సిందూరి" అని పేరు పెట్టారు.
పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ బుధవారం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్‌లో అనంత్‌నాగ్‌కు చెందిన కాశ్మీరీ ముస్లిం ఎయిర్ వైస్ చీఫ్ మార్షల్ హిలాల్ అహ్మద్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించినట్లు సమాచారం.
పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్‌గా పాక్ ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు చేపట్టింది భారత్. తొమ్మిది చోట్ల దాడులు చేసినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. దాడి ఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
‘ఆపరేషన్ సిందూర్’పై కాంగ్రెస్ నేత ఖర్గే సంచలన కామెంట్స్ చేశారు. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్ర శిబిరాలపై భారత్ సైన్యం చేపట్టిన చర్యను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున సైనికులకు పూర్తి మద్దతు ప్రకటించారు.
భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరిట విజయవంతంగా దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఆపరేషన్ సిందూర్ 2.0కు కూడా ఇండియా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి లేదా మళ్లీ ఎప్పుడైనా పాక్ ఉగ్రస్థావరాలపై దాడులు జరపనున్నట్లు తెలుస్తోంది.