United Nations: పహల్గాం ఉగ్ర దాడి తరువాత నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్, ఇండియాలు సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. ఇప్పటికే UN సెక్రటరీ జనరల్ ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్ ఈ విషయమై స్పందించగా, తాజాగా UN సెక్రటరీ జనరల్ డిప్యూటీ స్పోక్స్ పర్సన్ ఫర్హాక్ హక్ కీలక ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య మరో యుద్ధాన్ని ఈ ప్రపంచం కోరుకోవడం లేదని అన్నారు. ఇండియా, పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను తగ్గించేందుకు ఐరాస తన వంతు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందని ప్రకటించారు.
ఇది కూడా చూడండి: IND PAK WAR 2025: జైసల్మేర్‌లో 70కి పైగా డ్రోన్లు, క్షిపణులు గాల్లోనే ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ!
ప్రపంచమంతా ఇండియా, పాకిస్థాన్‌ల వైపే చూస్తున్నాయని, ఈ నేపథ్యంలో ఇరు దేశాలు సంయమనం పాటించాలని మేము బలంగా కోరుకుంటున్నామని ఫర్హాక్ హక్ బలంగా కోరారు. ఆవేశపడి యుద్ధానికి వెళ్లడం సరికాదని సూచించారు. ఒకవేళ యుద్ధాలు చేయాల్సి వస్తే ఇరు దేశాలకు అనర్ధాలు తప్ప ఎవరికీ లాభం ఉండదని ఆయన స్పష్టం చేశారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా
యుద్ధాల వల్ల సమస్య పరిష్కార కాదు :మెహబూబా ముఫ్తీ
ఇక భారతదేశం, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇరు దేశాలు సంయమనం పాటించాలని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ పిలుపునిచ్చారు. పాకిస్థాన్ ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలను దెబ్బతీసిందని సోషల్ మీడియా ఎక్స్‌లో ఆమె పోస్ట్ చేశారు. అలాగే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రధాని మోడీ చర్చలు జరపాలని సూచించారు. యుద్ధాల వల్ల, సైనిక చర్యల వల్ల సమస్యకు పరిష్కారం లభించదని దాని వల్ల ఇరువురికి నష్టమే వాటిల్లుతుందని ఆమె అభిప్రాయ పడ్డారు. రెండు దేశాలు శాంతి కోరుకోవాలని సూచించారు.
ఇది కూడా చూడండి:BIG BREAKING: పాక్ ఫైటర్ జెట్ పైలెట్ ను సజీవంగా పట్టుకున్న భారత్