జమ్ము ఎయిర్ పోర్టుపై పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడికి ప్రయత్నించింది. దాదాపు 8 మిసైల్‌తో దాడికి దిగింది. ముందుగానే పసిగట్టిన భారత ‘సుదర్శన చక్రం’ S400 ఆ డ్రోన్లను గాల్లోనే ధ్వంసం చేసింది. దీంతో ఈ దాడి సమయంలో భారీగా పేలుడు శబ్ధాలు వినిపించాయి. జమ్ములోని సత్వారి కంటోన్మెంట్‌పై పాక్ డ్రోన్లు దాడికి దిగడంతో జమ్ము నగరం మొత్తం సైరన్‌లతో మోత మోగిపోయింది. ఇక పాకిస్తాన్‌కు చెందిన F-16 ఫైటర్ జెట్, రెండు JF17 యుద్ధ విమానాలను ఇండియన్ ఆర్మీ ముక్కముక్కలు చేసింది.
ఇది కూడా చూడండి: IND PAK WAR 2025: జైసల్మేర్‌లో 70కి పైగా డ్రోన్లు, క్షిపణులు గాల్లోనే ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ!
Jammu under attack by Pakistani drones
— Sidhant Sibal (@sidhant) May 8, 2025
-Air Raid Sirens on
-Interception activated
-Blackouts
-Airport appears to be the target pic.twitter.com/1aD3VWSUsp
1000 కిలోమీటర్ల రేంజ్
అయితే పాకిస్తాన్ చేసిన డ్రోన్ల దాడిని ఇండియన్ ఆర్మీకి చెందిన ‘హర్పి డ్రోన్స్’ సమర్ధవంతంగా అడ్డుకున్నాయి. అనంతరం వాటిని పిప్పి పిండిచేశాయి. పాకిస్తాన్‌పై హర్పి డ్రోన్స్ ప్రయోగం విజయవంతమైంది. పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను హర్పి డ్రోన్స్ తుక్కు చేసాయి. ఈ ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ఈ హర్పి డ్రోన్స్ అదరగొట్టేశాయి. వీటి రేంజ్ దాదాపు 1000 కిలోమీటర్లు కాగా.. వీటి బరువు సుమారు 135 కిలోలుగా ఉంది. ఈ డ్రోన్స్ రాడార్ సిస్టమ్స్‌ను ధ్వంసం చేసేలా డిజైన్ చేయబడ్డాయి.
ఇది కూడా చూడండి: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా
Jammu civil airport attacked by Pakistan. India's air defence (S400) gets activated. Security agencies confirming 8 missiles directed from Pakistan at Jammu civil airport, Samba, RS Pura, Arnia and neighhbouring areas and all were intercepted/blocked by S400. Praying for the… pic.twitter.com/ddAO1mbfv5
— Deadly Law (@DeadlyLaw) May 8, 2025
ప్రత్యర్థి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం చేయడంలో ఇవి ఎంతో దిట్ట. అంతేకాకుండా హై ఎక్స్‌ప్లోజివ్ వార్ హెడ్ దీని సొంతం. ఇందులో యాంటీ రేడియేషన్ సీకర్‌ను అమర్చారు. ఇది డీప్ స్ట్రైక్ మిషన్స్ చేయడంలో ఫుల్ ఎక్స్‌పర్ట్ కూడా. ఇది ఒక్కసారి యాక్టివేట్ అయిందంటే.. దాదాపు 9 గంటల పాటు ఆపరేషన్ కొనసాగించే సామర్థ్యం ఉంటుంది.
Pak India War | ind pak war | operation Sindoor