CP Radha Krishnan: బాంబులు విసిరినా బెదరని నైజం.. RSS కార్యకర్త నుంచి ఉప రాష్ట్రపతి వరకు.. రాధాకృష్ణన్ బ్యాగ్రౌండ్ ఇదే!
ఉప రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. RSS కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఎంపీగా, గవర్నర్ గా పని చేశారు. 1998లో తొలిసారిగా ఎంపీగా పోటీ చేసిన సమయంలో ఆయనపై బాంబు దాడి జరిగింది.