/rtv/media/media_files/2025/11/14/women-vote-share-helps-to-nda-win-in-bihar-elections-2025-11-14-17-13-20.jpg)
Women vote share helps to nda win in Bihar Elections
బీహార్(Bihar assembly election 2025)లో మరోసారి ఎన్డీయే అధికార పగ్గాలు చేపట్టనుంది. 200 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఎన్డీయే.. 34 స్థానాల్లో మహాగఠ్‌బంధన్ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీయే(nda) విజయానికి అనేక అంశాలు కలిసివచ్చాయి. అందులో మహిళా ఓటర్ల భాగస్వామ్యం కూడా కీలకంగా మారింది. బీహార్‌వ్యాప్తంగా అనేక జిల్లాల్లో పురుషుల కంటే మహిళలే గణనీయ సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Also Read: బీహార్ సీఎం నితీశ్ కుమార్ కాదా ?.. ఎక్స్ పోస్టును డిలీట్ చేసిన జేడీయూ
Women Vote Share Helps To NDA Win
ఏడు జిల్లాల్లో పురుషుల కంటే మహిళలే 14 శాతం కన్నా ఎక్కువగా ఓట్లు వేశారు. కిషన్‌గంజ్‌లో 19.5 శాతం, మధుబనిలో 18.4, గోపాల్‌గంజ్‌లో 15.72, అరారియాలో 14.43, దర్భంగాలో 14.41, మాధేపురాలో 14.24 శాతం ఎక్కువగా మహిళలు ఓట్లు వేశారు. అలాగే ఇతర జిల్లాలో కూడా మహిళలు పది శాతానికి పైగా ఓటు వేశారు. వీటిలో సివాన్, సీతామర్హి , సహర్సా , తూర్పు చంపారన్ తదితర ప్రాంతాలు ఉన్నాయి. ఎన్డీయే కూటమి మహిళలకు స్వయం ఉపాధి కింద రూ.10 వేల ఆర్థిక సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మహిళా సాధికారత కోసం జీవికా దీదీ పథకాన్ని కూడా అమలు చేస్తోంది. ఇలాంటి పథకాలే మహిళల్లో ఎక్కువశాతం ఎన్డీయేకు ఓటు వేసినట్లు నిపుణలు అంచనా వేస్తున్నారు.
Also read: సొంత పార్టీకి పని చేయని ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ.. బిహార్ ఎన్నికల్లో జన్ సురాజ్ గల్లంతు
Follow Us