Bihar Elections: ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటిన ఎన్డీయే

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీయే దూసుకుపోతోంది. ప్రస్తుతం 123 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోన్న ఎన్డీయే కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

New Update
nda

ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఎన్డీయే నిజం చేస్తోంది. ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. ప్రస్తుతం 123 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోన్న ఎన్డీయే కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. దీని తర్వాత మహాగఠబంధన్ 71 స్థానాల్లో రెండవ స్థానంలో ఉంది. మరో నాలుగు చోట ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు. ఒకే క స్థానంలో జన్‌సురాజ్‌ పార్టీ అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో విజయంపై జేడీయూ ధీమా వ్యక్తం చేసింది. మరోసారి నీతీశ్ ప్రభుత్వం రాబోతోందని, అందుకు బిహార్‌ సిద్ధంగా ఉందంటూ ఎక్స్ లో పోస్ట్ కూడా పెట్టింది.

Advertisment
తాజా కథనాలు