Bihar : బిహార్‌ సీఎంగా మరోసారి నితీష్ కుమార్!

బీహార్‌లో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), జనతాదళ్ (యునైటెడ్) (జేడీయూ) కూటమి మధ్య కొత్త మంత్రివర్గ కూర్పుపై తుది ఫార్ములా ఖరారైంది.

New Update
nitish kumar

బీహార్‌లో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), జనతాదళ్ (యునైటెడ్) (జేడీయూ) కూటమి మధ్య కొత్త మంత్రివర్గ కూర్పుపై తుది ఫార్ములా ఖరారైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో కేబినెట్ ఫార్ములాను ఖరారు అయింది. మరో మూడు రోజుల్లో కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడనుంది. నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని వర్గాలు సూచించాయి. 

బీజేపీ తరఫున ఒక ఉప ముఖ్యమంత్రిని నియమించాలని నిర్ణయించారు. ఉప ముఖ్యమంత్రి ఎవరనేది బీజేపీ కేంద్ర నాయకత్వం త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. మంత్రివర్గంలో జేడీయూ,  బీజేపీల మధ్య కీలక శాఖలు, మంత్రి పదవుల కేటాయింపులో దాదాపుగా సమతుల్యత పాటించాలని నిర్ణయించారు. ప్రధాని మోదీతో పాటు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు చెందిన అనేక మంది కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, కూటమిలోని సీనియర్ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని సమాచారం. 

మోడీ షెడ్యూల్‌పై

బీహార్ లో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమం బుధవారం లేదా గురువారం జరుగుతుందని సమాచారం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షెడ్యూల్‌పై తుది తేదీ ఉంటుందని తెలుస్తోంది. బీజేపీకి15 లేదా 16 మంత్రి పదవులు, జేడీయూకు14 మంత్రి పదవులు లభించే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) మూడు పదవులు,  కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ హిందూస్థానీ అవామ్ మోర్చా, రాజ్యసభ ఎంపి ఉపేంద్ర కుష్వాహా రాష్ట్రీయ లోక్ సమతా పార్టీలకు ఒక్కొక్క మంత్రి పదవి లభించే అవకాశం ఉంది.

కాగా బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ భారీ మెజారిటీతో గెలిచింది, జేడీయూ, బీజేపీ రెండూ 2020 కంటే మెరుగైన ఫలితాలు సాధించాయి. బీజేపీ 89 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది, ఆ తర్వాత జేడీయూ 85 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఎల్జేపీ(ఆర్వీ), హెచ్ఏఎం, ఆర్ఎల్ఎం వంటి చిన్న మిత్రపక్షాలు కూడా మంచి సీట్లు గెలిచాయి.

Advertisment
తాజా కథనాలు