/rtv/media/media_files/2025/11/14/bihar-elections-2025-11-14-11-13-30.jpg)
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జోరుగా కొనసాగుతోంది. ఇందులో ఎన్డీయే దూసుకుపోతోంది. 174 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ అందరి కంటే 79 స్థానాల్లో ముందంజలో ఉంది. దాని తరువాత బీజేపీ 74 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ రెండు పార్టీలు కలిపి మహాఘట్బంధన్ ను వెనక్కు నెట్టేశాయి. ఈ సారి కూడా నితీష్-మోదీ కాంబినేషన్ హిట్ కొట్టించారు బీహార్ ప్రజలు. ఆ సారి ఎన్నికల్లో అత్యధికంగా పోలింగ్ నమోదైంది. బీహారీయులు రెండు దశల పోలింగ్ లో కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరూ కలిసి ఎన్డీయేను గెలిపించారు.
బీహార్ ఫలితాల్లో 5 ఆసక్తికర అంశాలు..
1. నితీష్-మోదీ ద్వయంపై నమ్మకం..
బీహార్ ఎన్నికల నుండి ఇప్పటివరకు వెలువడుతున్న ట్రెండ్‌లు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. బీహార్ ప్రజల విశ్వాసం చెక్కుచెదరనీయకుండా ఉంచడంలో నితీష్, మోదీ ద్వయం సక్సెస్ అయింది. 20 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత కూడా, బీహార్ ప్రజలు నితీష్ కుమార్ పట్ల సంతృప్తిగా ఉన్నారు. దీని కారణంగానే నితీష్ కుమార్ పార్టీ జెడియు మాత్రమే కాకుండా, అన్ని ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల అభ్యర్థులు కూడా ట్రెండ్‌లలో ఆధిక్యాన్ని చూపిస్తున్నారు.
2. సీఎంగా తేజస్వీ యాదవ్ నచ్చలేదు..
బీహార్‌లోని చాలా మంది ప్రజలు తేజస్వి యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరించడానికి నిరాకరించారని స్పష్టంగా తెలుస్తోంది. మహా కూటమి సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్‌నే అనుకున్నారు. అతని బ్యానర్లు, పోస్టర్లే చాలా ఎక్కువ కనిపించాయి. కానీ ప్రజలు మాత్రం తేజస్వీ యాదవ్ ను వద్దనుకున్నారని స్పష్టంగా తెలుస్తోంది.
3. ఓటు చోరీ పని చేయలేదు..
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఓటు దొంగతనం అంశం బీహార్ ప్రజలను మాత్రం ప్రభావితం చేయలేకపోయింది. ఓటు దొంగతనం సమస్యను పరిష్కరించడానికి రాహుల్ గాంధీ బీహార్ అంతటా ఓటర్ల హక్కుల యాత్ర చేశారు. తేజస్వి యాదవ్, దీపాంకర్ భట్టాచార్య మరియు ముఖేష్ సాహ్ని, ఇతర గ్రాండ్ అలయన్స్ నాయకులతో కలిసి ఐక్యతను ప్రదర్శించడానికి ప్రయత్నించారు. కానీ ఏం చేసినా బీహార్ ప్రజలు మాత్రం ఎన్డీయే వైపే మొగ్గు చూపించారు.
4. తేలిపోయిన జన సూరజ్
ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రశాంత్ కిశోర్ నమ్మకాన్ని బీహార్ ఓటర్లు వమ్ము చేశారు అతని పార్టీ జన సూరజ్ ను పూర్తిగా తిరస్కరించారు. జన సూరజ్ పార్టీ కేవలం ఒకే ఒక్క చోట ఆధిక్యంలో ఉంది. అక్కడ కూడా గెలుస్తుందో లేదో డౌటే అంటున్నారు. సోషల్ మీడియాలో గొప్పగా చెప్పుకున్న జాన్ సూరజ్ ప్రచారం పూర్తిగా విఫలమైనట్లు కనిపిస్తోంది.
5. ఎన్డీయే వైపే మహిళలు మరియు EBCలు..
ఎప్పటి కంటే ఈ సారి బీహార్ లో అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది. అందులో మహిళలు పెద్ద సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇప్పటివరకు వచ్చిన ట్రెండ్‌లు మహిళల ఓటింగ్ NDAకి అనుకూలంగా ఉందని స్పష్టంగా చూపించాయి. ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముఖేష్ సాహ్ని నామినేషన్ కూడా మహా కూటమికి పెద్దగా ప్రయోజనకరంగా కనిపించడం లేదు. తన నామినేషన్ మహా కూటమికి EBC ఓట్లలో గణనీయమైన వాటాను అందిస్తుందని ముఖేష్ సాహ్ని పేర్కొన్నారు, కానీ ఈ ట్రెండ్‌లు దీనికి మద్దతు ఇస్తున్నట్లు కనిపించడం లేదు.
Follow Us