/rtv/media/media_files/2025/11/14/nda-touches-200-mark-in-bihar-assembly-elections-2025-11-14-14-35-25.jpg)
NDA Touches 200 Mark in bihar assembly elections
బీహార్ అసెంబ్లీ ఎన్నికల(Bihar Assemly Elections 2025) ఫలితాల్లో ఎన్డీయే కూటమి(nda) దూసుకుపోతోంది. ఇప్పటికే 200 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఉంది. మహాగఠ్‌బంధన్ కూటమి మాత్రం 37 స్థానాల్లోనే ముందంజలో ఉంది. మొత్తానికి ఈసారి కూడా ఎన్డీయే కూటమి బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ఎన్నికలను ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్(tejaswi-yadav) ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం, ఉచిత విద్యుత్ లాంటి హామీలు ఇచ్చారు. అయినా కూడా బీహార్ ప్రజలు ఎన్డీయే వైపే మొగ్గు చూపారు.
బెడిసికొట్టిన తేజస్వీ హామీలు
ఎన్నికలకు ముందు మహాగఠ్‌బంధన్ కూటమి ఓటర్లను ఆకర్షించేందుకు పలు హామీలు ప్రకటించింది. అందులో కీలకమైనది ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోనే ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అందించే చట్టం తీసుకొస్తామని తేజస్వీ యాదవ్ హామీ ఇచ్చారు. అలాగే ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పేద కుటుంబాలకు రూ.500 లకే గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం, ప్రతి వ్యక్తికి రూ.25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా లాంటి హామీలు ప్రకటించారు.
Also Read: తేజస్వీ యాదవ్‌కు మూడోసారీ దక్కని CM కుర్చి.. బిహార్‌లో మహాఘట్‌బంధన్‌కి బిగ్ షాక్!
అంతేకాదు పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించడం, రైతులకు కనీస మద్దతు ధర కల్పించడం, మహిళలకు నెలకు రూ.2500, వితంతులు, వృద్ధులకు రూ.2000, దివ్యాంగులకు రూ.3000 పెన్షన్లు ఇస్తామని తెలిపారు. అయినప్పటికీ మహాగఠ్‌బంధన్ కూటమి హామీలను బీహర్ ఓటర్లు పట్టించుకోలేదు. ఈసారి కూడా ఎన్డీయే కూటమికే అధికార పీఠం కట్టబెట్టారు.
ఎన్డీయేకే పట్టం
నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే కూడా పలు కీలక హామీలు ఇచ్చింది. ఐదేళ్లలో రాష్ట్ర యువతకు కోటికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో కోటి మంది మహిళలను "లఖ్‌పతి దీదీ" లుగా అంటే ఏడాదికి రూ.1 లక్ష వరకు సంపాదించేలా మారుస్తామని చెప్పింది. పేద కుటుంబాలకు కేజీ టూ పీజీ ఉచిత విద్య, ప్రతి వ్యక్తికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా, పేదలకు 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 50 లక్షల ఇళ్లు నిర్మించడం లాంటి హామీలు ప్రకటించింది.
Also Read: శపథం చేసిన పట్టించుకోని బిహారీ ఓటర్లు.. ఈమె మళ్లీ మాస్క్ వేయల్సిందేనా?
గత ఎన్నికల్లో ప్రకటించిన హామీలను కూడా అమలు చేసింది. ఎన్నికల ప్రచారంలో కూడా ఎన్డీయే కూటమి నేతలు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి అంటూ విస్తృతంగా ప్రచారం చేశారు. అలాగే బడ్జెట్‌లో కేంద్రం బీహార్‌కు ఎక్కువగా నిధులు కేటాయించింది. ఈ క్రమంలోనే బీహారీ ప్రజలు.. ఈసారి కూడా ఎన్డీయే కూటమికే పట్టం కట్టారు.
Follow Us