/rtv/media/media_files/2025/11/20/nithish-2025-11-20-11-45-00.jpg)
బిహార్ సీఎంగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఆయన చేత సీఎంగా ప్రమాణం చేయించారు. పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా, జెపి నడ్డా, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఏపీ సీఎం చంద్రబాబు, ఢిల్లీ సీఎం రేఖ గుప్తా తదితరులు హాజరయ్యారు.
పదోసారి ప్రమాణస్వీకారం
నితీష్ కుమార్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం ఇది పదోసారి కావడం విశేషం. ఇది రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఓ రికార్డు అని చెప్పాలి. సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా 26 మంది ప్రమాణం చేశారు. బీజేపీ (14), జేడీయూ (8), ఎల్జేపీ (రామ్‌విలాస్) (2), హిందుస్థానీ అవామీ మోర్చా (1), రాష్ట్రీయ లోక్ మోర్చా (1) సభ్యులతో మంత్రి వర్గం ఏర్పాటు చేయనున్నారు నితీష్. మరో 10 మంది మంత్రులను కేబినెట్ లోకి తీసుకోనున్నారు.
🚨: Nitish Kumar has taken oath as the Chief Minister of Bihar for the 10th time. pic.twitter.com/YqxrrY8iXK
— NOT HUMAN (@NoThUmAn003) November 20, 2025
ఇక తన తండ్రి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంపై నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ మాట్లాడుతూ.. "నా తండ్రి 10వ సారి ప్రమాణ స్వీకారం చేసినందుకు ఆయనకు నా శుభాకాంక్షలు.. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని అన్నారు.
Follow Us