/rtv/media/media_files/2025/11/14/chirag-paswan-2025-11-14-18-48-17.jpg)
Chirag Paswan plays role as NDA's Ravindra Jadeja
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే అఖండ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జన్‌శక్తి పార్టీ(రామ్ విలాస్) అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఎన్నికల్లో ఎల్‌జేపీ 29 స్థానాల్లో పోటీ చేయగా 23 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రికెట్‌లో రవీంద్ర జడేజా చివరి ఓవర్లలో మ్యాచ్‌ను గెలిపించినట్లే.. చిరాగ్ పాస్వాన్ కూడా ఎన్డీయే తరఫున ఇలాంటి పాత్రే పోషించినట్లు ఆయనపై ప్రశంసలు వస్తున్నాయి.
Also Read: హత్య కేసులో జైలుకెళ్లి ఎన్నికల్లో గెలిచిన JDU నేత
ఈ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ చెరో 101 స్థానాల్లో పోటీ చేయగా.. ఎల్‌జేపీ 29 స్థానాల్లో బరిలోకి దిగింది. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ స్కోర్‌ను ముందుకు తీసుకెళ్లినట్లే.. బీజేపీ, జేడీయూ అత్యధిక స్థానాల్లో మెజార్టీలో ఉన్నాయి. చివరగా చిరాగ్ పాస్వాన్ పార్టీ కూడా అద్భుతమైన ఆధిక్యంతో తుది మెరుగులు దిద్దింది.
Also Read: బీహార్‌లో ఎన్డీయేను గెలిపించిన మహిళా ఓటర్లు
2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌జేపీ 137 స్థానాల్లో పోటీ చేసింది. కానీ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. ఈసారి ఎన్డీయేతో పొత్తు పెట్టుకొని 29 స్థానాల్లో బరిలోకి దిగి 23 స్థానాల్లో గెలుపు దిశగా దూసుకుపోతోంది. దీంతో ఎన్డీయే మెజార్టీని 200 మార్క్ దాటించింది.
Follow Us