BIG BREAKING: ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ముగ్గురి దుర్మరణం!
పూణేలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వారి పైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 2 చిన్నారులతో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఎన్డీయేలో చేరనున్న నేషనల్ కాన్ఫరెన్స్ !.. క్లారిటీ ఇచ్చిన పార్టీ
జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోనే ఎన్సీ పార్టీ.. త్వరలో ఎన్డీయేలో చేరబోతుందనే వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఎన్సీ పార్టీ తాజాగా స్పందించింది. ఇవి నిరాధారమైన ఆరోపణలంటూ కొట్టిపారేసింది.
Rahul Gandhi: రాహుల్‌గాంధీకి బిగ్ షాక్.. యూపీ కోర్టు సమన్లు
విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి బిగ్ షాక్ తగిలింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కులగణనపై ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను ఉత్తరప్రదేశ్‌లో బరేలీ జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఇస్రో, ఈసా మధ్య కీలక ఒప్పందం
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ESA)తో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) శనివారం కీలక ఒప్పందం చేసుకుంది. వ్యోమగాములకు ట్రైనింగ్ , పలు పరిశోధనలకు సంబంధించిన పనులకు సహకరించుకునేందుకు ఈ ఒప్పందంపై ఇరు సంస్థలు సంతకాలు చేసుకున్నాయి.
YS Jagan: జగన్‌కు చంద్రబాబు, నాగబాబు బర్త్ డే విషెస్..
శనివారం మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సీఎం జగన్, జనసేన నేత నాగబాబు ఎక్స్‌లో ట్వీట్లు చేశారు. అల్లుఅర్జున్ అభిమానులు సైతం ఆయనకు ఫ్లెక్సీలు కట్టారు.
KOTA: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది 17 మంది
రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు ఆగడం లేదు. తాజాగా మరో జేఈఈ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. గురువారం హాస్టల్ గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Winter Sessions: ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. 129వ రాజ్యంగ సవరణ బిల్లు(జమిలి ఎన్నికల బిల్లు)ను లోక్‌సభ.. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించింది. అమిత్ షా వ్యాఖ్యలపై విపక్ష సభ్యులు ఆందోళనలు చేస్తున్న క్రమంలోనే ఉభయసభలను నిరవధికంగా వాయిదా వేశారు.