సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు దానీ సమీపంలోకి పార్కర్ సోలార్ ప్రోబ్‌ను నాసా పంపించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి నాసా కీలక ప్రకటన చేసింది. సూర్యునికి దగ్గరగా వెళ్లిన పార్కర్ సోలార్ ప్రోబ్ ప్రస్తుతం సురక్షితంగానే ఉందని పేర్కొంది. సుర్యుడికి అతి దగ్గరికి వెళ్లిన తర్వాత తాత్కాలికంగా దాని నుంచి సిగ్నల్ అందలేదని ఇటీవల అధికారులు చెప్పారు. సిగ్నల్స్ కోసం శుక్రవారం వరకు వేచి చూడాలని భావించారు. కానీ గురువారమే దాని నుంచి సిగ్నల్స్ వచ్చినట్లు తెలిపారు. Also Read: అలా చేయకుంటే స్థానిక ఎన్నికలు జరగనివ్వం.. కవిత సంచలన కామెంట్స్ ఇక వివరాల్లోకి వెళ్తే గురువారం రాత్రి పార్కర్ సోలార్ నుంచి సిగ్నల్ వచ్చిందని మేరీలాండ్‌లో ఉన్న జాన్ హప్కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ ల్యాబ్ చెప్పింది. డిసెంబర్ 24 సూర్యుడి ఉపరితలానికి 6.1 మిలియన్ కిలోమీటర్ల దూరంలోకి వెళ్లి.. అత్యంత దగ్గరికి చేరినట్లు పేర్కొంది. ఇప్పటిదాకా ఏ వ్యోమనౌక కూడా సూర్యుడికి ఇంత దగ్గరగా వెళ్లలేదని తెలిపింది. మరోవైపు పార్కర్ సోలార్ ప్రోబ్ వచ్చే ఏడాది జనవరి 1న తన పరిశోధనలకు సంబంధించిన డేటాను పంపించనుందని నాసా వెల్లడించింది. ఈ పరిశోధనలు సూర్యూడి బాహ్య వాతావరణమైన కరోనా ప్రాంతంలో కణాలు మిలియన్ల డిగ్రీల వరకు ఎలా వేడెక్కుతాయనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదిలాఉండగా.. నాసాతో సహా ఇతర పరిశోధన సంస్థలు పార్కర్ ప్రోబ్‌ను సంయుక్తంగా తయారుచేశాయి. ఈ వ్యోమనౌక 1800 డిగ్రీల ఫారెన్‌హీట్ (982 డిగ్రీల సెల్సియస్) వరకు ఉష్ణోగ్రతను తట్టుకుంటుందని నాసా తెలిపింది. అలాగే అత్యధిక ఉష్ణోగ్రతలను సైతం తట్టుకునేలా దానిచుట్టూ గట్టి కవచం కూడా ఉందని పేర్కొంది. Also Read: యూనివర్సిటీలో యువతిపై గ్యాంగ్‌రేప్.. కొరడాతో కొట్టుకున్న బీజేపీ స్టార్ లీడర్ శాంపిల్స్ సేకరణ కోసం వినియోగించేందుకు బిగించిన కప్, మరొక పరికరం మాత్రం కవచం బయట ఉంటుదని చెప్పింది. అయితే అవి కరిగిపోకుండా ఉండేందుకు టంగ్‌స్టన్, నియోబియం, మాలిబ్డినమ్, సఫైర్ లాంటి పదార్థాలతో శాస్త్రవేత్తలు వాటిని రూపొందించారు. కరోనా పొరపై 7 ఏళ్ల పాటు పరిశోధనలు చేసేందుకు 2018లో నాసా ఈ పార్కర్ సోలార్ ప్రోబ్‌ను సూర్యుని వద్దకు పంపించింది. 2021 ఏప్రిల్ 28న తొలిసారిగా ఈ వ్యోమనౌక కరోనా పొరలోకి ప్రవేశించింది.