సుప్రీకోర్టు రైతు సంఘాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ ఆరోగ్యం రోజురోజకి క్షీణిస్తున్నా ఆయన్ని పట్టించుకోకపోవంపై మండిపడింది. ఆయనకు కనీసం వైద్యసాయం కూడా అందకుండా అడ్డుకుంటున్న రైతు సంఘాల తీరును తప్పుబట్టింది. నిజంగా ఆయన క్షేమం కోరుకునేవారు ఇలా అడ్డుకోరు. ఈ విషయాన్ని వాళ్లకి తెలియజేయాలని జస్టిస్ సూర్యకాంత్ పంజాబ్ చీఫ్‌సెక్రటరీకి సూచించారు. Also Read: చెన్నై గ్యాంగ్ రేప్ ఘటన.. నిందితుడికి డీఎంకేతో సంబంధాలు ! ఇక వివరాల్లోకి వెళ్తే.. తమ సమస్యలను పరిష్కరించాలని రైతులు గత కొంతకాలంగా నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. గతంలోనే ఆయనకు వైద్య సాయం అందించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. కానీ ఈ ఆదేశాలు అమలుచేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ పంజాబ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీకి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన న్యాయస్థానం ఈ వ్యా్ఖ్యలు చేసింది. నిరవధిక దీక్ష చేస్తున్న దల్లేవాల్ వైద్యసాయం అందించాలని ఇప్పటికే తాము ప్రభుత్వానికి ఆదేశాలిచ్చామని తెలిపింది. వాటిని అమలు చేసేందుకు రాష్ట్రం చేస్తున్న యత్నాలపై కోర్టు సంతృప్తి చెందలేదని పేర్కొంది. Also Read: మా నాన్న చనిపోతే ఏం చేశారు.. కాంగ్రెస్‌పై ప్రణబ్ ముఖర్జీ కూతురు సంచలన ఆరోపణలు.. అంతేకాదు ఈ వ్యవహారంలో పంజాబ్‌కు ఏదైనా సాయం కావాలంటే కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. తర్వాతి విచారణను డిసెంబర్ 31న చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది. పంటలకు కనీస మద్ధత ధరకు చట్టబద్ధత కల్పించడం, తదితర డిమాండ్లతో ఈ ఏడాది నవంబర్ 26 నుంచి జగ్జీత్ సింగ్ దల్లేవాల్ పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో నిరవధిక నిరసన దీక్ష చేపట్టారు. ఆయనకు ఇంకా వైద్య సాయం అందకపోవడంతనే సుప్రీంకోర్టు ఇలా సీరియస్ అయ్యింది.