Chennai Gang rape: చెన్నై గ్యాంగ్‌ రేప్ ఘటన.. నిందితుడికి డీఎంకేతో సంబంధాలు !

చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరగడం సంచలనం రేపుతోంది. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న నిందితుడు జ్ఞానశేఖరన్ డీఎంకే పార్టీ వాడనే ఫొటోలు వైరలవుతున్నాయి. దీనిపై స్పందించిన డీఎంకే అతడికి పార్టీతో సంబంధం లేదని తేల్చిచెప్పింది.

New Update
Gnanashekaran with DMK Leaders

Gnanashekaran with DMK Leaders

చెన్నైలోని అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరగడం సంచలనం రేపుతోంది. ఈ అఘాయిత్యానికి పాల్పడ్డవారిలో జ్ఞానశేఖర్ అనే నిందితుడిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అయితే జ్ఞానశేఖరన్‌కు అధికార డీఎంకే పార్టీతో సంబంధం ఉందంటూ వార్తలు వచ్చాయి. ఆ పార్టీ నేతలతో అతడు ఉన్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరవుతున్నాయి. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తో దిగిన ఫొటోలు కూడా బయటకి వచ్చాయి అయితే తాజాగా ఈ వ్యవహారంపై డీఎంకే పార్టీ స్పందించింది. 

Also Read: మా నాన్న చనిపోతే ఏం చేశారు.. కాంగ్రెస్‌పై ప్రణబ్ ముఖర్జీ కూతురు సంచలన ఆరోపణలు..

జ్ఞానశేఖరన్‌కు డీఎంకే పార్టీతో ఎలాంటి సంబంధం లేదని మంత్రి రఘుపతి అన్నారు. చాలామంది ప్రముఖులతో ఫొటోలు దిగుతారని అంతమాత్రాన వాళ్లని పార్టీకి ముడిపెట్టడం సరికాదని తెలిపారు. ఇదిలాఉండగా ఈ నెల 23న చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో ఓ యువతిపై గుర్తుతెలియని వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ యువతి రాత్రి యూనివర్సిటీ ప్రాంగణంలో తన స్నేహితుడితో మాట్లాడుతుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఇద్దరు యువకులు.. ఆ అమ్మాయి స్నేహితుడిని గాయపర్చారు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు.

అనంతరం ఆ యువతిని అసభ్యకరంగా ఫొటోలు తీసి.. తమపై ఫిర్యాదు చేస్తే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. అయినప్పటికీ బాధితురాలు ధైర్యంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు యూనివర్సిటీ ప్రాంగణంలోని సీసీ కెమెరాల సహాయంతో నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని చెన్నై కోట్టూరుపురానికి చెందిన జ్ఞానశేఖరన్‌గా గుర్తించారు. జ్ఞానశేఖరన్‌ రోడ్డు పక్కన బిర్యానీ అమ్ముకునేవాడని సమాచారం. మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Also Read: BNSL నుంచి ఫ్రీ OTT, 300 ఛానల్స్, మూవీస్, వెబ్ సిరీస్ ఎంజాయ్

మరోవైపు ఈ వ్యవహారంపై బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కె అన్నామలై కూడా స్పందించారు. అన్నా యూనివర్శిటీ విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసుపై పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించాయని విమర్శించారు. దీనికి నిరసనగా కోయంబత్తూరులోని తన నివాసం బయట కొరడాతో కొట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు