మరికొన్ని రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. అయితే 2025లో మొత్తం నాలుగు గ్రహణాలు జరగనున్నాయి. ఇందులో రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు. అయితే వీటిలో ఒకటి మాత్రమే భారత్‌లో కనిపించనుంది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జీవాజీ అంతరిక్ష అధ్యయన కేంద్రం సూపరింటెండెంట్ డా. రాజేంద్ర ప్రకాశ్ గుప్తా ఈ విషయాన్ని వెల్లడించారు.
Also Read: అలా చేయకుంటే స్థానిక ఎన్నికలు జరగనివ్వం.. కవిత సంచలన కామెంట్స్
'' 2025లో మార్చి 14న సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. అయితే అది పగటిపూట వస్తుంది. దీంతో మనదేశంలో ఇది కనిపించే అవకాశం లేదు. అమెరికా, పశ్చిమాఫ్రికా, పశ్చిమ ఐరోపా, ఉత్తర, దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రాల వద్ద ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది. మార్చి 29న పాక్షిక సూర్య గ్రహణం సంభవిస్తుంది. దీని ప్రభావం కూడా భారత్‌లో ఉండదు. నార్త్ అమెరికా, యూరప్, వాయువ్య రష్యాలోనే ఈ గ్రహణం కనిపిస్తుంది.
Also Read: యూనివర్సిటీలో యువతిపై గ్యాంగ్‌రేప్.. కొరడాతో కొట్టుకున్న బీజేపీ స్టార్ లీడర్
సెప్టెంబర్ 7,8వ తేదీల మధ్య ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణాన్ని మాత్రం భారత ప్రజలు వీక్షించే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఖగోళ ప్రేమికులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ చంద్రగ్రహణ కేవలం భారత్‌లోనే కాకుండా యూరప్, ఆస్ట్రేలియా, పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అంటార్కిటికా ప్రాంతాల్లో పూర్తిగా కనిపిస్తుంది. వచ్చే ఏడాదిలో చివరి గ్రహణం సెప్టెంబర్ 21-22 మధ్య సంభవిస్తుంది. అయితే ఈ పాక్షిక సూర్యగ్రహణం భారత్‌లో కనిపించదని'' రాజేంద్ర ప్రకాశ్ గుప్తా వివరించారు.
Also Read: నేను జైలులో ఉన్నప్పుడు మన్మోహన్ అండగా ఉన్నారు..మలేషియా ప్రధాని ఎమోషనల్ ట్వీట్!
Also Read: విరాట్‌ను అవమానించిన ఆసీస్ మీడియా.. ఆ పేరుతో హెడ్ లైన్స్