మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. వాట్సాప్ స్టేటస్‌లలో, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లలో, ఎక్స్‌లో పోస్టులు చేస్తూ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు చేసిన సేవలను స్మరించుకుంటున్నారు. అయితే మన్మోహన్ సింగ్‌కు దేశం పట్ల ఎంత అంకితభావం ఉందో తెలియజేసే ఓ విషయం తాజాగా బయటపడింది. ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనకు హృదయ సంబంధిత శస్త్ర చికిత్స జరిగిన తర్వాత చెప్పిన మాటలు వింటే ఇప్పుడు గుండెల్ని పిండేస్తున్నాయి. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: మన్మోహన్ తో వైఎస్, చంద్రబాబు, KCRతో పాటు తెలుగు ముఖ్య నేతలు
'' ఇక వివరాల్లోకి వెళ్తే 2009లో మన్మోహన్ సింగ్‌కు ఢిల్లీలోని ఎయిమ్స్ దాదాపు 10 నుంచి 11 గంటల వరకు క్లిష్టమైన హృదయ సంబంధిత శస్త్ర చికిత్స జరిగింది. సర్జరీ ముగిశాక వైద్యులు ఆయనకు శ్వాస తీసుకునేందుకు వీలుగా అమర్చిన ఒక పైప్‌ను తొలగించారు. ఆ సమయంలో స్ప్రుహ నుంచి కోలుకున్న మన్మోహన్ సింగ్ మొదటగా నా దేశం ఎలా ఉంది ? కశ్మీర్ ఎలా ఉంది ? అని తనకు సర్జరీ చేసిన వైద్యుడు డా. రమాకాంత్ పాండాని అడిగారు. అప్పుడు ఆ వైద్యుడు మీ సర్జరీ గురించి ఎలాంటి ప్రశ్న అడగలేదేంటి అన్నారు.
దీనికి మన్మోహన్ సింగ్ స్పందిస్తూ.. '' నాకు సర్జరీ గురించి ఎలాంటి బెంగ లేదు. నా దేశం గురించే నేను ఎక్కువగా ఆందోళన చెందుతున్నానని'' అన్నారు. దీన్ని బట్టి చూస్తే అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మన్మోహన్ సింగ్ ఇలా మాట్లాడారంటే దేశం పట్ల ఆయనకున్న నిజాయతి, నిబద్ధత ఏంటో స్పష్టంగా అర్థమవుతోంది.
Also Read: యూనివర్సిటీలో యువతిపై గ్యాంగ్‌రేప్.. కొరడాతో కొట్టుకున్న బీజేపీ స్టార్ లీడర్
ఇదిలాఉండగా.. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మాజీ పీఎం మన్మోహన్ సింగ్‌కు గురువారం తీవ్ర అస్వస్థకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స తీసుకుంటుండగానే రాత్రికి ఆయన తుదిశ్వాస విడిచారు. అయితే డిసెంబర్ 28న (శనివారం) కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.