ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తమ యూజర్లకు బిగ్ షాకిచ్చింది. రోజువారీ డేటా పరిమితి అయిపోయినప్పుడు వినియోగించే రూ.19, రూ.29 డేటా వోచర్ల వ్యాలిడిటీని కుదించింది. ప్రస్తుతం జియో వెబ్‌సైట్‌లో ప్లాన్లను పరిశీలిస్తే కొత్త కాలపరిమితులు అమల్లోకి వచ్చాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. రోజువారీ డేటా అయిపోయినప్పుడు చాలామంది అదనపు డేటా కోసం స్పెషల్ రిఛార్జులు చేసుకుంటారు. అయితే జియో రూ.19 ప్లాన్‌తో 1 జీబీ డేటా, రూ.29 ప్లాన్‌తో 2 జీబీ డేటా అందిస్తోంది.
Also Read: స్వర్గంలో రతన్ టాటా, కలాం, శాస్త్రితో మన్మోహన్.. వైరల్ అవుతున్న AI ఫొటోలు!
ప్రస్తుతం ప్లా్న్ గడువు ముగిసేవరకు ఈ డేటా వోచర్లకు వ్యాలిడిటీ ఉండేది. తాజాగా ఈ కాలవ్యవధిని జియో కుదించింది. రూ.19 ప్లాన్‌తో రిఛార్జ్‌చేసుకుంటే దాని కాలవ్యవధిని ఒక్కరోజుకు మాత్రమే పరిమితం చేసింది. రూ.29 ప్లాన్ కాలవ్యవధిని రెండు రోజులుగా నిర్ణయించింది. ప్రస్తుతం తక్కువ ధరలో రూ.11తో మరో డేటా ప్యాక్ కూడా అందిస్తోంది. కేవలం గంట వ్యవధి కలిగిన ఈ ప్యా్క్‌తో అన్‌లిమిటెడ్ డేటా పొందవచ్చు.
Also Read: ముంబై పేలుళ్ల సూత్రధారి.. అబ్దుల్ రెహ్మాన్ మక్కి కన్నుమూత