TG EAPCET: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు ఎప్పుడంటే ?
తెలంగాణలో ఆదివారం ఉదయం 11 గంటలకు ఎప్సెట్ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. విద్యార్థులు సాధించిన ర్యాంకులు, మార్కుల లిస్టును విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణలో ఆదివారం ఉదయం 11 గంటలకు ఎప్సెట్ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. విద్యార్థులు సాధించిన ర్యాంకులు, మార్కుల లిస్టును విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్లోనే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది.
జమ్మూలో పాకిస్థాన్ 8 మిసైల్స్,10 డ్రోన్లతో దాడులకు యత్నించింది. ఒక F16, రెండు F17 ఫైటర్ జెట్లను కూడా ప్రయోగించింది. వెంటనే అప్రమత్తమైన ఇండియన్ ఆర్మీ మిసైల్స్, డ్రోన్లను కూల్చివేసింది. అలాగే F16, రెండు F17 యుద్ధ విమానాలకు కూడా నేలమట్టం చేసింది.
ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ వైమానిక దాడుల్లో ఉగ్రవాదులు మాత్రమే హతమయ్యారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఈ దాడుల్లో పాకిస్థాన్ పౌరులు చనిపోయారని వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.
ఆపరేషన్ సిందూర్ పేరును ట్రేడ్మార్క్ చేసుకోవాలన్న యత్నాలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ వెనక్కి తగ్గంది. తమ సంస్థలో ఓ జూనియర్ ఉద్యోగి పర్మిషన్ తీసుకోకుండానే ఈ దరఖాస్తు చేశాడని స్పష్టం చేసింది. అయినప్పటికీ దాన్ని తాము ఉపసంహరించుకున్నట్లు పేర్కొంది.
భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరిట విజయవంతంగా దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఆపరేషన్ సిందూర్ 2.0కు కూడా ఇండియా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి లేదా మళ్లీ ఎప్పుడైనా పాక్ ఉగ్రస్థావరాలపై దాడులు జరపనున్నట్లు తెలుస్తోంది.
భారత ఆర్మీ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన తర్వాత పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మౌనంగా ఉన్నాడు. ఈ దాడుల తర్వాత ఆయన ఎక్కడా కూడా కనిపించలేదు. ఇటీవల అతడు దేశం విడిచి పారిపోయాడనే వార్తలు కూడా వచ్చాయి.
ఆపరేషన్ సిందూర్ పై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. శత్రువులకు గట్టిగా బుద్ధి చెప్పామన్నారు. అమాయకులను చంపినవాళ్లనే హతం చేశామని..హనుమంతుడినే ఆదర్శంగా తీసుకున్నామని తెలిపారు.
ప్రధాని మోదీ.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సమావేశం అయ్యారు. పాకిస్థాన్, POKలో ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ చేపట్టిన దాడుల గురించి ఆమెకు వివరించారు. కేంద్రం రేపు ఉదయం 11 గంటలకు అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చింది.