Abu Saifullah: లష్కరే తోయిబా కీలక కమాండర్ హతం
లష్కరే తోయిబా కీలక కమాండర్ అబు సైఫూల్లా హతమయ్యాడు. పాక్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అతడిని కాల్చి చంపారు. సైఫుల్లా భారత్‌లో మూడు ఉగ్రదాడులకు సూత్రధారిగా ఉన్నాడు.
లష్కరే తోయిబా కీలక కమాండర్ అబు సైఫూల్లా హతమయ్యాడు. పాక్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అతడిని కాల్చి చంపారు. సైఫుల్లా భారత్‌లో మూడు ఉగ్రదాడులకు సూత్రధారిగా ఉన్నాడు.
మే నెలాఖరు నాటికి బీజేపీ కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రేసులో కేంద్రమంత్రులైన ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ ఉన్నట్లు సమాచారం. వీళ్లిద్దరూ కూడా ఓబీసీ వర్గానికి చెందినవారు.
పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేసిన జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.జ్యోతి పాకిస్థాన్‌తో గూఢచర్యం చేస్తుందని తెలిస్తే ఆమెతో కాంటాక్ట్‌లో ఉండేదాన్ని కాదని పూరీకి చెందిన యూట్యూబర్ తెలిపారు.పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.
ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. 273 ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించింది. వాటిలో 88 డ్రోన్లను కూల్చేశామని ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకటించింది. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ఇదే అతిపెద్ద డ్రోన్ దాడి అని తెలుస్తోంది.
ఇండియన్ ఆర్మీ ఎక్స్‌లో మరో సంచలన వీడియో విడుదల చేసింది. ఇది రివేంజ్ కాదు.. న్యాయం మాత్రమే అంటూ క్యాప్షన్ ఇచ్చింది. పాకిస్థాన్‌పై దాడులను పక్కగా ప్లాన్ చేసి.. శిక్షణ తీసుకొని, అమలు చేశామని ట్వీట్ చేసింది.
పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన తర్వాత అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) పాకిస్థాన్‌పై మరింత ఒత్తిడి తీసుకొస్తోంది. ఇందుకోసం మరో 11 ఆర్థికపరమైన షరతులు విధించింది.
భారత్ పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఇరుదేశాలు ప్రత్యక్ష చర్చలు జరపాలని అమెరికా, చైనా భారత్‌కు ఇటీవలే సూచనలు చేశాయి. ఇప్పుడు తాజాగా రష్యా కూడా ఈ సూచనే చేసింది. ఈ విషయంలో ఇరుదేశాలు ముందుకెళ్లాలని కోరుతున్నామని తెలిపింది.
భారత్‌లో ఈ కామర్స్ సేవలందిస్తున్న అమెజనా, ఫ్లిప్‌కార్డ్ సహా పలు కంపెనీలకు కేంద్రం నోటీసులు పంపించింది. పాకిస్థాన్‌కు చెందిన జెండాలు, ఆ దేశ వస్తువులను ఆన్లైన్లో అమ్ముతున్నారనే ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకుంది.