/rtv/media/media_files/2025/05/22/gNizhwcfWdgrLAkkjqyt.jpg)
Huband Builds Temple for Wife in Tamil nadu
పెళ్లయిన కొంతకాలనికి భర్త లేదా భార్య చనిపోతే ఆ వేదన వర్ణించలేనిది. తమ భాగస్వాముల జ్ఞాపకాలతోనే కొందరు కాలన్ని వెల్లదీస్తుంటారు. అయితే తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి తన భార్య జ్ఞాపకార్థం ఏకంగా గుడి కట్టించి పూజలు చేస్తున్నాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. అరియలూర్కు చెందిన విజయ కుమార్ కవిత అనే మహిళను 16 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు.
వాళ్ల వివాహ తర్వాత విజయ కుమార్.. తన భార్య కవితను కాలేజీకి తీసుకెళ్లి చదివించాడు. వాళ్లది పెద్దలు కుదిర్చిన వివాహం అయినప్పటికీ పెళ్లి తర్వాత ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. అయితే 2022లో ఓసారి కవిత తన భర్తతో కలిసి తిరుచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చెకప్ కోసం వెళ్లారు. అక్కడ ఆమెకు కృత్రిమ గర్భదారణ సర్జరీ జరిగింది. ఆ సమయంలో ఔషధం అధిక మోతాదులో తీసుకోవడంతో కవిత మరణించింది. దీంతో విజయకుమార్ గుండె పగిలిపోయింది.
రోజులు గడుస్తున్నా కూడా భార్యపై అతనికున్న ప్రేమ మాత్రం తగ్గలేదు. ఆమెతో గడిపిన రోజులు గుర్తుచేసుకుంటూ రోజులు వెల్లదీశాడు. ఇక చివరకీ తన భార్యకు గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఇలంగేరి గ్రామంలో తన భార్య కవిత కోసం ఓ ఆలయాన్ని నిర్మించాడు. అక్కడ ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించాడు. నాలుగు రోజులకొకసారి అక్కడ ఆమెకు పూజలు చేస్తున్నాడు.
విజయ్‌కుమార్‌ను అతని అత్తమామలు, బంధువులు మళ్లీ పెళ్లి చేసుకోమని చెప్పారు. కానీ అతను చేసుకోలేదు. తన భార్య కవితతోనే జీవితం ముగిసిందని.. ఆమె జ్ఞాపకాలతోనే జీవిస్తున్నాని తేల్చిచెప్పేశాడు. కవిత తనతో చాలా ప్రేమగా ఉండేదని.. ఎంతో అభిమానం చూపించేదని విజయకుమార్ తెలిపారు. తమకు పిల్లలు లేకపోయినప్పటికీ కూడా తాము ఒకరికొకరు పిల్లలుగానే జీవించామని పేర్కొన్నారు.
telugu-news | rtv-news | national-news | tamil-nadu