New Update
/rtv/media/media_files/2025/05/23/Ld9u0FpZgOuEScTVS1e8.jpg)
ex ias officer accused of 23 crores fraud with NRI
ఓ మాజీ ఐఏఎస్ అధికారి ఏకంగా రూ.23 కోట్ల మోసానికి పాల్పడ్డారు. ఆస్పత్రి నిర్మాణంతో పాటు పలు వ్యాపార సంస్థల్లో భాగస్వామ్యం కల్పిస్తానని నమ్మించి మోసం చేశాడని హైదరాబాద్ సీపీఎస్ పోలీసులకు ఓ ఎన్నారై ఫిర్యాదు చేశాడు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటున్న కొమ్మినేని కళ్యాణ్(59)కు స్నేహితుల ద్వారా మాజీ ఐఏస్ అధికారి పొన్నెకంటి దయాచారి 2015లో పరిచయమయ్యారు.
గుంటూరులో కుగ్లర్ పేరుతో ఓ ఆస్పత్రిని కడుతున్నామని.. అందులో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని దయాచారి.. కళ్యాణ్‌కు ఆశ చూపించారు. 2015లో సింగపూర్‌కు చెందిన ఓ సంస్థకు ఇసుక సరఫరా చేసే కాంట్రాక్టును దక్కించుకున్నామని చెప్పారు. ఆ తర్వాత ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి LPG సప్లై కాంట్రాక్టు దక్కించుకుందని ఫేక్ పత్రాలు చూపించి నమ్మించారు.
ఆ మాజీ ఐఏఎస్ అధికారి దయాచారి చెప్పిన మాటలు కల్యాణ్ నమ్మాడు. తన బ్యాంక్ ఆఫ్ అమెరికా ఖాతా నుంచి దయాచారికి చెందిన ‘ఏపీఐఎన్‌డీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్’ ఖాతాలోకి 2015 మార్చిలో 5 లక్షల డాలర్లు (అప్పటి విలువ ప్రకారం రూ.3.50 కోట్లు) బదిలీ చేశారు. కానీ ఆ తర్వాత దయాచారి స్పందించడం మానేశారు. ఇక ఎట్టకేలక కల్యాణ్ పోలీసులను ఆశ్రయించాడు. తాను పంపిన డబ్బు డాలర్ మారక విలువ ప్రకారం.. మొత్తం వడ్డీతో కలిపి తన పెట్టుబడి రూ.23 కోట్ల వరకు అవుతుందని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు.
rtv-news | national-news | telangana | nri
తాజా కథనాలు