Mumbai Airport: బూట్లలో కుప్పలు తెప్పలుగా బంగారం.. మొత్తం ఎన్ని కేజీలంటే?
ముంబై విమానాశ్రయంలో అక్రమంగా బంగారం తరలిస్తున్న వారిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి బూట్లలో ఉన్న 6.7 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపుగా రూ.6.3 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.