/rtv/media/media_files/2025/12/09/night-club-2025-12-09-16-13-25.jpg)
నాలుగు రోజుల క్రితం గోవాలోని బిర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్ లో సిలెండర్ పేలి అగ్ని ప్రమాదం(fire accident) చోటు చేసుకుంది. ఇందులో 25 మంది చనిపోయారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నివేదికలో తేలింది. ఈ ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే నైట్ క్లబ్ యజమానులు(goa- night club-owners-got-interpol) అయిన సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రా దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం వీరు థాయ్ లాండ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం జరిగిన శనివారం రాత్రి ఎఫ్‌ఐఆర్ నమోదైన కొద్ది గంటల్లోనే.. అంటే ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటలకు లూథ్రా సోదరులు ముంబై నుంచి థాయిలాండ్‌లోని ఫుకెట్‌కు విమానంలో పారిపోయినట్లు గోవా పోలీసులు కనుగొన్నారు. దీంతో వీరు ఇంటర్ పోల్ ను ఆశ్రయించారు.
Also Read : డ్యూటీ టైం తర్వాత నో ఆఫీస్ కాల్స్, మెయిల్స్.. పార్లమెంట్ లో రైట్ టూ డిస్‌కనెక్ట్ బిల్!
బ్లూ కార్నర్ నోటీసులు..
బిర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్ యజమానులు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాలు ఢిల్లీలో ఉండేవారు. ప్రమాదం జరిగినట్లు తెలుసుకున్న వెంటనే వీరు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు వీరి ఇళ్లకు వెళ్లగా అప్పటికే వారు అక్కడ లేరు. దీంతో వారి నివాసాల దగ్గర లుక్ అవుట్ నోటీసులు అతికించారు. దాంతో పాటూ గోవా పోలీసులు సీబీఐలోని ఇంటర్‌పోల్ విభాగంతో సమన్వయం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంటర్ పోలీసులు లూథ్రా బ్రదర్స్ పై బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశారు. నిందితులు ఇద్దరూ విదేశాల్లో ఉన్నారనే అనుమానంతోనే ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఒక వ్యక్తి గుర్తింపు, స్థానం లేదా కార్యకలాపాల గురించి సమాచారాన్ని కోరడానికి ఈ బ్లూ కార్నర్ నోటీసులు ఇస్తారు. సరిహద్దుల మీదుగా వారి కదలికలను ట్రాక్ చేయడానికి ఈ నోటీస్ ఉపయోగ పడుతుంది. 196 దేశాల్లో నేరాలను అరికట్టడానికి, నేరస్తులను పట్టుకోవడానికి ఇంటర్ పోల్ సహాయపడుతుంది. బ్లూ నోటీస్ అంతర్జాతీయ వారెంట్ కానప్పటికీ.. రంగును బట్టి నేరస్తులపై ఎలాంటి చర్యలను తీసుకోవాలనేది తెలుస్తుంది.
Also Read : బర్త్ డే నాడు సోనియా గాంధీకి బిగ్ షాక్.. మళ్లీ తెరపైకి పౌరసత్వం కేసు.. కోర్టు కీలక ఆదేశాలు!
లైసెన్స్ అయిపోయినా..
డిశంబర్ 7 అర్థరాత్రి ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో బర్చ్ బై రోమియో లేన్’ నైట్ క్లబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సిలిండర్ పేలి 25 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు పర్యటకులు ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా వారంతా క్లబ్ సిబ్బందిగా గుర్తించారు. ఇందులో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. చనిపోయిన వారిలో ముగ్గురు సజీవదహనం అవ్వగా...20 మంది ఊపిరాడక చనిపోయారని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన నైట్‌క్లబ్ రాజధాని పనాజీకి 25 కి.మీ దూరంలో ఉంది. క్లబ్‌కు సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ 2024 మార్చిలోనే గడువు ముగిసినట్లు అధికారులు గుర్తించారు. గడువు ముగిసిన లైసెన్స్‌తోనే క్లబ్ నడిచినా స్థానిక అధికారులు పట్టించుకోలేదు. అందుకే ప్రమాదం జరిగిన వెంటనే దీని యజమానులు దేశం విడిచి పారిపోయారని తెలుస్తోంది.
Follow Us