/rtv/media/media_files/2025/12/09/sonia-gandhi-gets-notice-from-rouse-avenue-court-over-voter-list-inclusion-before-citizenship-claims-2025-12-09-14-18-20.jpg)
Sonia Gandhi gets notice from Rouse Avenue Court over voter list inclusion before citizenship claims
కాంగ్రెస్(congress) మాజీ అధ్యక్షురాలు, ఎంపీ సోనియా గాంధీ(sonia-gandhi)కి మరో బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ(delhi) రౌస్ అవెన్యూ సెషన్స్ కోర్టు(rouse-avenue-court) నోటీసులు జారీ చేసింది. భారత పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందుగానే సోనియా గాంధీ ఓటు హక్కు పొందారని ఇటీవల కోర్టులో పిటిషన్ దాఖలయ్యింది.ఫేక్ పత్రాల ద్వారా ఓటు హక్కు పొందిన ఆమెపై కేసు నమోదు చేయాలని అందులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే దీనిపై సమాధానం చెప్పాలని కోర్టు ఆమెకు సమన్లు జారీ చేసింది.
Also Read: ఇండిగో సంక్షోభానికి ఈ 5 కారణాలే.. కేంద్రానికి సంచలన లేఖ!
Sonia Gandhi Gets Notice From Rouse Avenue Court
ఇదే కేసులో సోనియా గాంధీతో పాటు ఢిల్లీ పోలీసులకు కూడా నోటీసులు జారీ చేసిన కోర్టు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఢిల్లీకి చెందిన న్యాయవాది వికాస్ త్రిపాఠి.. రౌస్ అవెన్యూ మేజిస్ట్రేట్ కోర్టులో ఆమెపై పిటిషన్ దాఖలు చేశారు. సోనియా గాంధీ పేరును 1980లో ఓటర్ల లిస్టులో చేరిస్తే 1983లో ఆమెకు భారత పౌరసత్వం వచ్చిందని పేర్కొన్నారు. పౌరసత్వానికి ముందే ఓటు హక్కు పొందడం కోసం ఆమె ఫేక్ పత్రాలు సృష్టించారని పిటిషనర్ ఆరోపించారు.
Also Read: తెలంగాణకు కేంద్రం బిగ్ షాక్.. కొత్త ఎయిర్పోర్ట్స్ కు బ్రేక్!
అయితే సరైన ఆధారాలు లేకపోవడం వల్ల 2-025 సెప్టెంబర్‌లో అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ వైభవ్ చౌరాసియా ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు. దీంతో కోర్టు ఆదేశాన్ని సవాల్ చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టులో వికాస్ త్రిపాఠి రివిజన్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ క్రమంలోనే మంగళవారం దీనిపై రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే విచారణ చేపట్టారు. ఈ అంశంపై నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టినరోజు కూడా. ఈ సందర్భంగా ఆమెకు కోర్టు నుంచి నోటీసులు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Follow Us