Nirmala Sitharaman: కొనసాగుతున్న రూపాయి పతనం.. స్పందించిన నిర్మలా సీతారామన్..

రూపాయి విలువ పతనం కొనసాగుతుండటంతో కేంద్రం ఎట్టకేలకు స్పందించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ అంశంపై హిందుస్థాన్ టైమ్స్‌ లీడర్‌షిప్ సదస్సులో మాట్లాడారు. కరెన్సీపై ఎక్కువగా రాజకీయం చేయాడన్ని తప్పుబట్టారు.

New Update
Finance Minister nirmala Sitharaman

Finance Minister Nirmala Sitharaman

దేశంలో రూపాయి(rupee) పతనం కొనసాగుతోంది.  ఒక డాలర్‌కు రూపాయి విలువ ఏకంగా రూ.90కి చేరడంపై కేంద్రంపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఆదివారం నాటికి దీని విలువ రూ.89.96 వద్ద కొనసాగుతోంది. ఇటీవల కనిష్ఠ ధర రూ.90.43 దాటడం దుమారం రేపింది. ఈ క్రమంలోనే తాజాగా దీనిపై కేంద్రం ఎట్టకేలకు స్పందించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(nirmala-seetharaman) ఈ అంశంపై హిందుస్థాన్ టైమ్స్‌ లీడర్‌షిప్ సదస్సులో మాట్లాడారు. 

Also Read: కేంద్రం సంచలన నిర్ణయం.. మారిన విమాన టికెట్ ధరలు

Nirmala Sitharaman Responds On Rupee Touches 90 Against Dollar

రూపాయి విలువలో భారీ జోక్యం చేసుకోకుండా మార్కెట్‌ శక్తులకే వదిలివేయాలని సూచించారు. మారకం రేట్లు చాలా సున్నితంగా ఉన్నాయని తెలిపారు. అయితే కరెన్సీపై ఎక్కువగా రాజకీయం చేయాడన్ని తప్పుబట్టారు. ప్రస్తుత రూపాయి స్థాయిలను గత పరిస్థితులతో పోల్చకూడదని అన్నారు. 2026 ఆర్థిక సంవత్సరంలో  7 శాతం లేదా అంతకన్నా ఎక్కువ అంచన వేసిన భారత వృద్ధి పథంపై ఫోకస్ పెట్టాలని కోరారు. 

Also Read: ఇండిగో అంతరాయంపై రంగంలోకి దిగిన కేంద్రం.. CEO పీటర్ ఎల్బర్స్ తొలగింపు ?

అంతేకాదు రూపాయి బలహీనమైతే పూర్తిగా ప్రతికూలంగా చూడాల్సిన పనిలేదని చెప్పారు. దీని విలువ క్షీణించినప్పుడు ఎగుమతిదారులు కూడా తరచుగా ప్రయోజనం పొందుతారని తెలిపారు. ఇది భారతీయ వస్తువులను విదేశాల్లో మరింత పోటీగా మారుస్తుందని పేర్కొన్నారు. 

Advertisment
తాజా కథనాలు