Mexico: మెక్సికోలో విషాదం.. బస్సు-ట్రక్కు ఢీ.. 41 మంది సజీవ దహనం
దక్షిణ మెక్సికోలోని టబాస్కో రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 48 మందితో వెళ్తున్న బస్సును ఓ ట్రక్కు ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి 40 మంది సజీవ దహనమయ్యారు. ఇప్పటి వరకు 18 మందికి చెందిన అవశేషాలను గుర్తించినట్లు అధికారు తెలిపారు.