/rtv/media/media_files/2025/01/07/jk8ttk9yQFBRmwmOPcAB.jpg)
Donald Trump, Justin Trudeau
అమెరికా, కెనడాల మధ్య వాణిజ్య యుద్ధం రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్నటివరకు తగ్గేదే లే అన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సడెన్ గా వెనక్కు తగ్గారు. ఆ దేశాల నుంచి దిగుమతి అయ్యే పలు సరకులపై సుంకాల పెంపు కార్యక్రమాన్ని నెల రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇదే సమయంలో కెనడా విధిస్తున్న సుంకాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
నెలరోజుల తర్వాత మాత్రం అమలు అవుతాయి..
కెనడా అమెరికాపై అధిక శాతం సుంకాలను విధిస్తోందని ట్రంప్ అన్నారు. కలప మీద అత్యధికంగా టారీఫ్ లను వసూలు చేస్తోంది. ఆ దేశ కలపపై ఆధారపడకుండా మా అడవుల్లోని కలపను వినియోగించేలా ఉత్తర్వులపై సంతకం చేస్తాను. మా దగ్గర అత్యుత్తమ కలప ఉంది. ఇతర దేశాలపై ఆధారపడకుండా స్వయం సమృద్ధిని సాధించుకోగలం అని అన్నారు. తమ దేశ పాల ఉత్పత్తులపై 250 శాతం శాతం సుంకాలను వసూలు చేస్తోందని చెప్పుకొచ్చారు. ఏప్రిల్ 2 నుంచి ఇతర దేశాలతో పాటూ కెనడా, మెక్సికోలపై కూడా పరస్పర సంగాలను అమలు చేస్తామని తెలిపారు. మరోవైపై కెనడా మాత్రం అమెరికా నుంచి దిగుమతయ్యే 107 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై కెనడా 25 శాతం సుంకం విధించామని తెలిపారు. దీనిపై ట్రంప్ మాట్లాడుతూ ట్రూడో అధికారంలో కొనసాగడానికే సుంకాల వివాదాన్ని ఉపయోగించుకుంటున్నారని అన్నారు.
Also Read: TS: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు..తెలంగాణ కేబినెట్ ఆమోదం
మరోవైపు మెక్సికో మీద విధించిన సుంకాల కార్యక్రమాన్ని కూడా వాయిదా వేస్తున్నట్టు చెప్పారు ట్రంప్. ఆ దేశాధ్యక్షురాలు క్లాడియా షేన్‌బా తో చర్చల తర్వాత ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. అక్రమ చొరబాట్లు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తామని ఆమె హామీ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే సుంకాలను ప్రస్తుతం వాయిదా వేశారో రీజన్ మాత్రం చెప్పలేదు.
Also Read: TS: మహిళా సాధికారతకు పట్టం..ఇందిరా శక్తి మిషన్-2025